ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా ప్రభుత్వ ఆదాయాలు పెరుగుతున్నాయి. పన్ను వసూళ్లు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని తాజా పన్ను వసూళ్లు చెప్పకనే చెబుతున్నాయి. రాష్ట్రంలో 2025 మార్చి నెలకు గాను రూ.3,116 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు సమకూరాయని రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ బాబు.ఏ తెలిపారు. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ ఏడాది జీఎస్టీ ఆదాయం 8.35 శాతం మేర అదనంగా పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి 31 వరకు మొత్తం రూ.33,660 కోట్ల జీఎస్టీ ఆదాయం సమకూరగా, 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గ్రాస్ జీఎస్టీ వసూళ్లు రూ.44,825 కోట్లుగా నమోద య్యాయి. గత ఆర్థిక సంవత్సరం (2024 మార్చి 31తో ముగిసిన) గ్రాస్ జీఎస్టీ వసూళ్లు రూ.44,298 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది వసూళ్లు 1.19 శాతం మేర పెరిగాయి.

నెలవారీ జీఎస్టీ ఆదాయం వివరాలు:
2024 అక్టోబర్: రూ.2,820 కోట్లు  

2024 నవంబర్: రూ.2,843 కోట్లు  

2024 డిసెంబర్: రూ.2,524 కోట్లు  

2025 జనవరి: రూ.2,904 కోట్లు  

2025 ఫిబ్రవరి: రూ.2,937 కోట్లు  

2025 మార్చి: రూ.3,116 కోట్లు

వ్యాట్, వృత్తి పన్ను వసూళ్లు:
పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ వసూళ్లలో తగ్గుదల నమోదైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.16,176 కోట్లు వసూలు కాగా, మద్యంపై వ్యాట్ ఆదాయంలో కూడా 4.02 శాతం తగ్గుదలతో రూ.924 కోట్లు మాత్రమే సమ కూరాయి. అయితే, వృత్తి పన్నులో 15 శాతం మేర అదనపు ఆదాయం లభించి, రూ.372 కోట్ల పన్ను వసూలైంది.

మొత్తం రెవెన్యూ:
జీఎస్టీతో పాటు వ్యాట్ మరియు వృత్తి పన్ను కలిపి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.51,297 కోట్ల రెవెన్యూ సమ కూరినట్లు బాబు.ఏ వెల్లడించారు. ఈ ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఊతమిచ్చే అంశంగా నిలుస్తోందని ఆయన పేర్కొ న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: