ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో గతేడాది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెజారిటీ ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా ముస్లింల ప్రయోజనాలకు భంగం కలగకుండా టీడీపీ వ్యవహరించడం కొసమెరుపు. వక్ఫ్ బిల్లులో టీడీపీ నాలుగు సవరణలు కోరగా ఆ సవరణల వల్ల ముస్లింలకు ఎంతో మేలు చేకూరుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.

 
వక్ఫ్ ఆస్తుల కేసులు తిరిగి తెరిచే అవకాశం లేకుండా చేయడంతో పాటు వక్ఫ్ స్థలాల విషయంలో న్యాయ పరంగా కూడా ఛాన్స్ కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ పత్రాలను సమర్పించడానికి కనీసం 180 రోజుల సమయం ఇవ్వాలని టీడీపీ కోరడం కొసమెరుపు. ముస్లింల మత వ్యవహారాలలో ఇతర మతాల జోక్యం ఉండటం కూడా కరెక్ట్ కాదని టీడీపీ కోరింది.

 
టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయాలు ముస్లింలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనాలను కలిగిస్తాయి. ముస్లింలకు తాను ఏ మాత్రం వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు చెప్పకనే చెబుతున్నారు. వక్ఫ్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించగా 288 మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే 232 మంది వ్యతిరేకంగా ఓటేశారు. కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే తదితర విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయి.

 
ప్రభుత్వ వాదన ఒక విధంగా ఉంటే విపక్షాల వాదన మరో విధంగా ఉంది. ఈ బిలు వెనుక దురుద్దేశాలు ఉన్నాయని విపక్షాలు చెబుతున్నాయి. ముస్లింల ప్రయోజనాలను దెబ్బ తీయడానికి మోదీ సర్కార్ కుట్ర పన్నిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజ్యసభలో సైతం ఈ బిల్లు సులువుగానే ఆమోదం పొందే ఛాన్స్ అయితే ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదు. వక్ఫ్ బిల్లు పేరును ఉమ్మీద్ గా మార్చడం గమనార్హం. ఎన్డీయే సర్కార్ అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: