రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. హామీల అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా కాంగ్రెస్ సర్కార్ వెనుకడుగు వేయడం లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రులు ప్రభుత్వ భూములను అమ్మడం కూడా కొత్తేం కాదు. గత ప్రభుత్వాలు సైతం ఇదే పని చేశాయి. హైదరాబాద్ లో అభివృద్ధి చెందిన చాలా ఏరియాలు ఒకప్పుడు అడవులు అనే సంగతి తెలిసిందే.
సెలబ్రిటీలు సమస్య ఎదురైతే ప్రత్యామ్నాయాలు సూచించాలే తప్ప ప్రభుత్వాన్నే నిందించే దిశగా అడుగులు వేయకూడదు. తెలంగాణ సర్కార్ కు, సినీ సెలబ్రిటీలకు ఈ నిర్ణయం మరింత గ్యాప్ పెంచే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో ఏదో జరిగిపోతుందని అర్థం వచ్చేలా రియాక్ట్ అవుతున్న సెలబ్రిటీలు అడవులను దత్తత తీసుకోవడానికి ఎందుకు రావడం లేదో చెబితే బాగుండేది.
పరిపాలన సజావుగా జరగాలంటే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ఒకింత కూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సైలెంట్ గా ఉన్న సెలబ్రిటీలు ఇప్పుడు మాత్రం ఘాటుగా స్పందిస్తుండటం కొసమెరుపు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందనే విధంగా ఎవరో సెలబ్రిటీ పోస్ట్ చేశారని ఆ పోస్ట్ ను చూసి ఇతర సెలబ్రిటీలు సైతం వంత పాడటం ఎంతమేర కరెక్ట్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సైతం ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వడం ద్వారా ఈ వివాదం మరింత పెద్దది కాకుండా జాగ్రత్త పడే అవకాశాలు అయితే ఉంటాయి.