మాజీ మంత్రులు బుగ్గన, రోజ తాము ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదో జగన్ ను ప్రత్యేకంగా కలిసి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని భోగట్టా. ఫీజు రీయింబర్స్ మెంట్ నగదు జమ కాకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి ప్రముఖ బీటెక్ కాలేజీలు నిరాకరిస్తూ ఉండటం ఏపీలో వివాదాస్పదం అవుతోంది. అయితే వైసీపీకి చెందిన 20 నుంచి 25 మంది నియోజకవర్గ ఇంఛార్జ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు.
కొంతమంది నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా తమ కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమానికి సంబంధించిన బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఎవరైతే ఈ తరహా కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తారో వాళ్లకు భవిష్యత్తులో సీటు కష్టమేనని జగన్ హెచ్చరించినట్టు సమాచారం అందుతోంది. అయితే జగన్ వార్నింగ్ తో నేతల తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.
2029 ఎన్నికల్లో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి రావాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. లక్ష్య సాధనలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేసినా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని జగన్ చెప్పకనే చెబుతున్నారు. జగన్ నేతలను ఎప్పటికప్పుడు మందలిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ ప్రణాళికలు ఎంత మేర వర్కౌట్ అవుతాయనే చర్చ సైతం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. జగన్ సైతం కొన్ని విషయాల్లో మారి ప్రజలతో మమేకమవుతూ కార్యకర్తలకు భరోసా ఇస్తూ ముందడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరినీ కలుపుకొని పోతే మాత్రమే 2029 నాటికి వైసీపీ పరిస్థితి మారుతుంది.