
జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా ముఖ్యమంత్రి నిర్వహించే సమావేశాలకు కూడా హాజరు కాని పరిస్థితి. ఇటు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షా సమావేశాలకు రాని ఆయన .. అటు కలెక్టర్లతో నిర్వహించిన సదస్సుకు రాని పవన్ .. పిఠాపురంలో జరిగిన తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సదస్సుకు మాత్రం హాజరయ్యారు. ఇదేంటో ఎవ్వరికి అంతు పట్టడం లేదు. ఇదిలా ఉంటే పవన్
నిజంగా అంత బిజీ గా ఉన్నారా ? చివరకు తన సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల్లో కూడా పాల్గొనలేనంత స్థాయిలో ఏమి పనులు చేస్తున్నారో వైసీపీ వాళ్ల కు సైతం అర్థం కాని పరిస్థితి. గురువారం జనసేన విడుదల చేసిన ప్రకటన చూస్తుంటే దీనిపై జనసేన వాళ్లకే చాలా సందేహాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్సీ .. పవన్ సోదరుడు కొణిదెల నాగబాబు ఈ నెల 4 , 5 తేదీ లలో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారటగ. అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తారట. ఈ కార్యక్రమాల్లో మరో జనసేన ఎమ్మెల్సీ ... ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ , టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్ తో పాటు .. పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ కూడా హాజరు కానున్నారంటూ అధికారులు చెప్పారు.
మామూలుగా ఇలాంటి కార్యక్రమాల్లో మంత్రులే నేరుగా పాల్గొంటారు. ఇది రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న అయిత తాజా గా ఎమ్మెల్సీ గా ఎంపికైన నాగబాబు కు ఈ బాధ్యతలు అప్పగించడం జనసేన వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక గత నెలలో పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఎంత కాంట్రవర్సీ అయ్యాయో చూశాం. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచారు అంటే ఇందులో నియోజకవర్గ ప్రజలు... జనసైనికులే ప్రధాన కారణం అని ... అలా కాదు తమ వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ ఖర్మ అంటూ పరోక్షంగా ఇక్కడ పవన్ కోసం సీటు వదులుకున్న మాజీ ఎమ్మెల్యే .. టీడీప నేత వర్మ ను ఉద్దేశించిన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.