
ముఖ్యంగా ఈ పరంపరలో టీడీపీనాయకులు ఎక్కువగా ఉన్నారు. మిత్రధర్మాన్ని పాటిస్తూ.. జనసేన, బీజే పీలకు కొన్ని పదవులు ఇస్తున్నప్పటికీ.. మెజారిటీ పదవులను టీడీపీ తీసుకుంది. ఆయా పదవుల భర్తీకి కూడా తీవ్రమైన కసరత్తు చేసి.. అనేక మాధ్యమాల్లో నాయకులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మరి ఇంత కీలకమైన కసరత్తు చేసిన తర్వాత ఎంపిక చేసిన నాయకులు.. ఆయా పదవులు దక్కించుకు న్న నాయకులు.. హ్యాపీగానే ఉన్నారా? అనేది ప్రశ్న.
ఎక్కడా ఏ పదవిని దక్కించుకున్న నాయకుడు కూడా హ్యాపీగా లేరని తాజాగా టీడీపీ సహా మిత్రపక్షాలలో నూ ఆందోళన, ఆవేదన కనిపిస్తోంది. ఒకప్పుడు వైసీపీ 56 సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. ఆయా పదవులకు నాయకులను కూడా నియమించింది. కానీ, ఆయా పదవులు దక్కించుకున్న నాయకులకు అధికారాల మాట ఎలా ఉన్నప్పటికీ.. నాయకులు కూర్చునేందుకు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు కనీసం కార్యాలయాలను కూడా.. ఏర్పాటు చేయలేకపోయారు.
అప్పట్లో వైసీపీకి ఇది పెద్ద మైనస్ అయిపోయింది. అన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత తమదేనని వైసీపీ చెప్పుకొన్నా.. కార్యాలయాలు లేకపోవడంతోపాటు.. అధికారాలు కూడా లేకపోవడంతో ఇది విఫలమైన ప్రయోగంగా మారి.. ఎన్నికల సమయంలో ఎలాంటి ప్రయోజనం ఇవ్వలేక పోయింది. అచ్చం.. ఇప్పుడు అదేసమస్య కూటమిని కూడా వెంటాడుతోంది. ఇప్పటి వరకు పదవులు పొందిన వారిలో 80 శాతం మందికిపైగానే ఆయా పదవులు తీసుకోలేదు. తీసుకుని వెనక్కి ఇచ్చేసినవారు కూడా ఉన్నారు. కాబట్టి.. పదవుల పంపకంలో ఎలాఉన్నా.. ఇచ్చిన పదవుల విషయంలో కూటమి పార్టీలు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది.