
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల బరిలో తొలిసారి పోటీ చేశారు. ఆయన రెండు నియోజకవర్గాలు గాజువాక తో పాటు భీమవరం రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా ఓడిపోయారు. పవన్ మొన్న పిఠాపురంలో పోటీ చేసి 72 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి ఫస్ట్ టైం అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా అడుగు పెట్టడంతో పాటు అటు కీలక శాఖలకు మంత్రి గా ఉండడంతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే మొన్న పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కోసం తన సీటు త్యాగం చేయడంతో పాటు పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన లేనిపోని వివాదాలకు దారి తీస్తోంది. ఆయన పర్యటనలో టీడీపీ ఇంచార్జ్ వర్మను పట్టించుకోవడం లేదు సరికదా .. కనీసం అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పిలవడం లేదు. కొన్ని చోట్ల వర్మ అనుచరులు గందరగోళం సృష్టిస్తున్నారు. జై వర్మ.. జై టీడీపీ నినాదాలు చేస్తుండం జనసేన .. టీడీపీ రెండు పార్టీల మధ్య లేని పోని గందరగోళం క్రియేట్ అయ్యేలా చేస్తోంది.
పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు క్షేత్ర స్థాయిలో వర్మను దూరం చేసుకోవాల్సిన అవసరం జనసేనకు లేకపోయినా వాళ్లు ఎందుకు కెలుక్కుంటున్నారో తెలియని పరిస్థితి. పైగా నాగబాబు జనసేన ఆవిర్భావ వేదిక మీద వర్మను పరోక్షంగా టార్గెట్ చేశారు ... వర్మ బహిరంగంగా పవన్ ను ఎప్పుడూ విమర్శించ క పోయినా.. జనసేన కేడర్‌ను తిట్టకపోయినా జనసేన అనవసరంగా వర్మను దూరం చేసుకుంటోన్న వాతావరనం పిఠాపురంలో ఉంది. ఎలా చూసినా వర్మకు స్థానిక బలం ఉంటుంది. ఆయన గతంలో తెలుగుదేశం సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచారు. ఫ్యూచర్ లో వర్మ అండదండలు పవన్ కు ఉంటే పవన్ అక్కడ మరింత బలమైన నేత అవుతారు. ఇలా వర్మను .. టీడీపీని కెలుక్కుంటూ పోతే పవన్‌కు 2029 ఎన్నికల్లో పిఠాపురంలో గెలుపు కష్టం కాక తప్పదు.