
సొంత ఎత్తుగడలు.. స్వీయ అజెండాలపై నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇలా ఉన్న ఏపీ కాంగ్రెస్‌ను సంస్కరించేందు కు కంకణం కట్టుకుంటానని.. కదిలి సాగుతామని చెప్పే ప్రయత్నం కూడా చేయని షర్మిలక్క.. తాజాగా గుజరాత్‌లోని ఇండస్ట్రి యల్ ఏరియా అహ్మదాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ ఏఐసీసీ సమావేశానికి వచ్చారు. వచ్చీ రావడంతోనే జాతీయ మీడియా ముందు.. నోరు విప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునేలా తన ప్రయత్నాలు సాగుతాయని.. తాను కూడా.. తన వంతుగా రాహుల్ గాంధీకి సహకరిస్తారని.. ప్రకటనలు గుప్పించారు.
అంతేకాదు.. జాతీయ స్థాయిలో నాయకత్వం మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు. తాను కూడా ఈ విషయంపై దృస్టి పెడ తానని షర్మిల చెప్పారు. అయితే.. జాతీయ స్థాయిలో నాయకత్వం.. నాయకులు.. ఎలా ఉన్నా.. షర్మిల వ్యవహారంలో ఆమెకు అప్పగించిన బాధ్యతలు.. ఏపీలో పుంజుకునే అంశాలపై మాత్రం దృష్టి కనిపించడం లేదని పార్టీ నాయకులే తాజాగా విమర్శలకు దిగారు. ఏపీలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ముందు ఏపీపై దృష్టి పెట్టు..! అంటూ.. సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.
గత ఏడాది ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పర్యటించిన షర్మిల.. తర్వాత.. ఇప్పటి వరకు ఎక్కడా ప్రజల కోసం పోరాడింది లే దు. రోడ్డెక్కింది కూడా లేదు. పైగా అన్న అజెండాను పట్టుకుని అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందు ఏపీలో పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసేందుకు.. నాయకులను లైన్‌లో పెట్టి నడిపించేందుకు కృషి చేయాలన్నది సీనియర్ నేతల మాట. ఇలా చేయనంత వరకు.. షర్మిల ఎన్ని చెప్పినా.. అవి..ఉట్టికెగరలేనమ్మ టైపులో వాగాడంబరాన్ని ప్రదర్శించడమేనని చెబుతున్నారు. మరి షర్మిలక్క ఏం చేస్తారో చూడాలి.