
అలాంటిది పది మాసాల్లోనే చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆశ లు పెట్టుకోవడం సహజమే అయినా. పదిమాసాల కాలంలో చేయగలిగినంత అయితే.. సర్కారుచేసింద న్న టాక్ వినిపిస్తోంది. పింఛన్ల పెంపు, ఉచిత సిలిండర్ వంటివాటిని పక్కన పెడితే.. రాష్ట్రానికి పెట్టుబడు ల వరదను పారించేందుకు చేస్తున్న ప్రయత్నం నిజంగానే మధ్యతరగతి ప్రజల నుంచి మన్ననలు అందుకుంటోంది.
అటు పర్యాటక పరంగా, ఇటు రాజధాని పరంగా కూడా.. రాష్ట్రానికి రాబోయేకొన్నిమాసాల్లోనే పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. ఇవి రాష్ట్ర భవితవ్యాన్ని సమూలంగా మార్చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని మేధావులు సైతం ఒప్పుకొంటున్నారు. ఇక, పాలన పరంగా.. ఎక్కడ సమస్య ఉంటే అక్కడకు సీఎం, డిప్యూటీ సీఎంలు వెళ్తుండడం.. వాటిని సత్వరమే పరిష్కరించే ప్రయత్నం చేయడం వంటివి కూటమి సర్కారుకు హైలెట్‌గా నిలుస్తోంది.
`మా బాధలు వింటారు.. పరిష్కరిస్తారు`- అనే నమ్మకాన్ని ప్రజలకు కల్పించడంలో ఇద్దరు అధినేతలు కూడా సక్సెస్ అయ్యారు. ఇక, పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్‌తో పాటు.. ప్రజాఫిర్యాదులను కూడా చేరువ చేశారు. వాటిపై రివ్యూలు చేస్తున్నారు. తద్వారా ప్రజల కు తాము అండగా ఉంటామన్న సంకేతాలు కూడా పంపించారు. అదేసమయంలో యువతకు అవకాశాల మెరుగుదులను కూడా పెంచుతున్నారు. సో.. మొత్తంగా ఈ పదిమాసాల పాలన ప్రజలతో మంచి మార్కులు వేయిస్తుండడం గమనార్హం.