రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ప‌దిమాసాలు పూర్త‌య్యాయి. ఈ నేప‌థ్యంలో కూట‌మి క‌ట్ట‌డానికి.. పార్టీలు గెల‌వడానికి.. బ‌ల‌మైన వైసీపీని గ‌ద్దె దించ‌డానికి కార‌ణ‌భూత‌మైన జ‌న‌సేన పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది? పార్టీ అధినేత తీరు ఎలా ఉంది? నాయ‌కుల ప‌నితీరుకు మార్కులు ఎలా ప‌డుతున్నాయ‌న్న చ‌ర్చ స‌హ జంగానే జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గానికి మాత్ర‌మే మార్కులు వేసుకున్నారు.


కానీ, జ‌న‌సేన విష‌యానికి వ‌స్తే.. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఎవ‌రికీ ఎలాంటి మార్కు లు వేయ‌లేదు. ఎవ‌రికి వారు ప‌నిచేసుకుని పోతున్నార‌ని.. దీనిలో త‌న జోక్యం అవ‌స‌రం లేద‌ని ఇటీవ‌ల ఆయ‌న మీడియాతోనూ వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో మార్కులు వేసి.. నాయ‌కుల‌ను ప‌రుగులు పెట్టించే సంస్కృతికి తాను విరుద్ధ‌మ‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అయింది. మ‌రి గ్రాఫ్ ఎలా ఉందో ఎలా తెలుస్తుంది? అనేది ప్ర‌శ్న‌.


ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఫీడ్ బ్యాక్‌తోపాటు.. త‌న ప‌ర్య‌ట‌న‌ల‌లో జ‌న‌సేన తీరుపై న‌ర్మ‌గ‌ర్భం గా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరా తీస్తున్నారు. జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున కాకుండా.. ప్ర‌భుత్వం త‌ర‌ఫునే ఆయ‌న ప్ర‌జ ల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవ‌ల అల్లూరి సీతారామరాజు జిల్లా కురిడి గ్రామంలో ప‌ర్య‌టించిన ప్పుడు ర‌చ్చ‌బండ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. జ‌న‌సేన పార్టీ అన్ని విధాలా అండ‌గా ఉంటోందా? అని ఆయ‌న ప్ర‌శ్నించి ఆరా తీయ‌డం గ‌మ‌నార్హం.


దీనిని ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. అదేస‌మ‌యంలో నాయ‌కుల తీరును కూడా అడిగి తెలు సుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న స‌మాచారం.. అందిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌న‌సేన‌పై వ్య‌తిరేక‌త అ యితే.. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రికీ లేదు. పైగా.. గ్రామీణ స్థాయిలో పార్టీ పుంజుకుంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ నియో జక‌వ‌ర్గాల‌పైనా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌న‌సేనకు మంచి మార్కులు ప‌డుతున్నాయ‌ని అంటున్నారు పార్టీ నాయ‌కులు. అక్క‌డ‌క్క‌డా చిన్న‌పాటి లోపాలు ఉన్న‌ప్ప‌టికీ.. వెంట‌నే స‌రిదిద్దుతున్న తీరును కూడా ప‌రిశీల‌కులు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: