
తద్వారా పేదలను ఉన్నతస్థాయిలోకి చేర్చాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా ఉంది. సమాజంలో ఉన్న ఉన్నత స్థాయి వర్గాలు.. పేదలను దత్తత తీసుకుని.. తద్వారా వారిని అభివృద్ధి చేయాలన్నది ప్రధాన కాన్సెప్టు. అయితే.. చాలామంది దీనివల్ల ఏం లాభం.. ప్రభుత్వంతన బాధ్యత నుంచి తప్పించు కునే ప్రయత్నాలు చేస్తోందన్న వాదనను వినిపిస్తున్నారు. కానీ, వాస్తవానికి దీనివెనుక చాలా పెద్ద స్ట్రాట జీనే ఉందని అంటున్నారు పరిశీలకులు.
గతంలో ఐటీకి పెద్ద పీట వేసినట్టుగానే.. ఇప్పుడు కూడా.. భవిష్యత్తులో ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా.. ఖజానాకు భారీ ఎత్తున గండి పడుతున్న విషయం తెలిసిందే. పేదలను ఆదుకునే పేరుతో లెక్కకు మిక్కిలిగా కూడా అప్పులు చేస్తున్నారు. వీటిని సక్రమంగా వినియోగిస్తున్నారా? లేదా? అనేది పక్కన పెడితే.. తద్వారా రాష్ట్రానికి బ్యాడ్ నేమ్ కూడా వస్తోంది. ఈ క్రమంలో అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేకపోవడంతోపాటు పెట్టుబడుల పైనా ప్రభావం చూపుతోంది.
వీటికి పరిష్కారం.. సంక్షేమ పథకాలు అందుకునే వారిని సాధ్యమైనంత వరకు తగ్గించాలన్నది చంద్ర బాబు సంకల్పం. ఇది ఇప్పటికిప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో వారి సంఖ్యను తగ్గించాలని భావిస్తు న్నారు. తద్వారా ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం ప్రారంభించారు. ఏ ప్రభుత్వం వచ్చినా.. పేదలకు మాత్రమే పథకాలు అమలు చేస్తుంది. వీరి సంఖ్య తగ్గుముఖం పడితే.. ప్రభుత్వాలు.. అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఈ వ్యూహాన్నే చంద్రబాబు అమలు చేస్తున్నారని అంటున్నారు మేధావులు.