
ఇక, మనదేశంలోనూ.. కార్పొరేట్ రెస్పాన్స్ పేరుతో ఉన్నతస్థాయి వర్గాలు ప్రజలకు సేవ చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా.. చెబుతోంది. అయితే.. ఈ సాయాలు కేవలం వరదలు, విపత్తులు వంటివి వచ్చి నప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. అలా కాకుండా.. ప్రతి నిత్యం వాటిరి ఎంగేజ్ చేయడంతోపాటు.. నిర్ణీత కాలానికి వారి నుంచి సేవలు అందేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందన్నది ప్రశ్నగా మారింది.
సక్సెస్ కావాలనే కోరుకోవడంలో తప్పులేదు. అయితే.. సాధారణంగా మన రాష్ట్రంలో ఉన్న పేదల మానసి క తీరు డిఫరెంట్‌గా ఉంటుంది. గతంలో చంద్రబాబు, ఎన్టీఆర్ సహా.. వైఎస్ ముఖ్యమంత్రులుగా ఉన్న ప్పుడు.. పేదలకు ఇళ్లు ఇచ్చారు. స్థలాలు ఇచ్చారు. వారికి గూడు ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్లు అని వైఎస్ తీసుకువచ్చారు. టిడ్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు కూడా ఆదు కున్నారు. ఇక, వైసీపీ హయాంలో జగనన్న కాలనీలనే నిర్మించారు.(వీటిలో కొన్నిపూర్తయ్యాయి)
అయినా.. పేదలు మాత్రం ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ మాకు ఇళ్లులేవంటూ లక్షల సంఖ్యలో పేదలు వస్తూనే ఉన్నారు. అర్జీలు పెడుతూనే ఉన్నారు., మరి ఇప్పటి వరకు ఇచ్చిన లక్షలాది ఇళ్లు ఏమయ్యా యి? పేదరికం ఎందుకు అంతం కావడం లేదు? అంటే.. రాష్ట్రంలో ఉన్న కొందరు పేదల స్థితిని గమనించిన ఓ సర్వే సంస్థ.. వీరు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అలవాటు పడ్డారని.. వీరు ఎప్పటికీ అలానే ఉండిపోతున్నారని.. తేల్చి చెప్పడం గమనార్హం.
ఇది కొంత వివాదాస్పద అంశమే అయినా.. వాస్తవమని చెప్పింది. నదీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు వేసుకున్నవారికి గతంలో ప్రభుత్వం ఇళ్లు ఇచ్చింది. నదీ పరివాహక ప్రాంతాలను శుభ్రం చేసింది. కానీ, ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి .. అన్ని నదుల పరివాహక ప్రాంతాల్లోనూ ఇళ్లు దర్శనమిస్తున్నాయి. ఇలా.. పీ-4 అనేక ఒక ఏడాదికో.. నాలుగేళ్లలో పరిమితమయ్యేది కాదని.. నిరంతరాయంగా కొనసాగాల్సిందేనని.. అంటున్నారు మేధావులు.