
జక్కంపూడి ఫ్యామిలీ జగన్‌కు దూరమవుతోందా ? వైసీపీని వీడుతుందా ? జక్కంపూడి బ్రదర్స్‌లో రెండో వాడు జక్కంపూడి గణేష్ జనసేన వైపు చూస్తున్నారా ? ఇవే ప్రశ్నలు గత కొద్ది రోజులుగా మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇటు వైసీపీలో ఇంటర్నల్‌గాను.. ఇటు ఏపీ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. గణేష్ ఎందుకు అసహనంతో ఉన్నారు ? జగన్ ఆయనకు ఇచ్చిన హామీ ఏంటి ? రాజమండ్రి వైసీపీలో ఏం జరుగుతోందన్నదే ఇప్పుడు పార్టీలో పెద్ద హాట్ టాపిక్. రాజమండ్రి కేంద్రంగా ఉన్న మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. సిటీ, రూరల్ నియోజకవర్గాల కంటే రాజానగరంలోనే వైసీపీ ఉన్నంతలో గట్టి పోటీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు కూడా జక్కంపూడి బ్రదర్స్‌కు రాజమండ్రి సిటీలో కొన్ని డిస్టబెన్సెస్ ఎదురయ్యాయి. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వారికి న్యాయం జరగడం లేదన్నదే వీరి ఆవేదన. ఎన్నికల తర్వాత కూడా ఇవే పరిస్థితులు పార్టీలో కంటిన్యూ అవుతున్నాయి. వీటిని సహించలేకే గణేష్ తన అసహనాన్ని కాస్త ఓపెన్‌గానే వ్యక్తం చేశారు.
జక్కంపూడి బ్రదర్స్‌కు జగన్ పెద్ద బాధ్యతలే ఇచ్చారా ?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి జక్కంపూడి ఫ్యామిలీ - వైఎస్సార్ ఫ్యామిలీ అనుబంధం ఎప్పుడూ చెక్కు చెదర్లేదు.. ఈ అనుబంధంలో ఎలాంటి పొరాపొచ్చలు లేవు. వైఎస్సార్ మరణం మరుక్షణం నుంచే జక్కంపూడి ఫ్యామిలీ జగన్ వెంట నడుస్తూ వస్తోంది. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్నోళ్లకు కాకుండా పార్టీకి వెన్నుపోటు పొడిచినోళ్లకు.. జగన్‌ను తిట్టినోళ్లను ఇప్పుడు కొందరు నేతలు పార్టీలోకి తీసుకువచ్చి పెద్ద పీఠ వేస్తున్నారు. ఇది గణేష్‌కు అస్సలు నచ్చడం లేదు.. గణేష్ దీనిని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ కొందరు చేసే రాజకీయాల వల్ల రాజమండ్రి రీజియన్లో ఉన్న మూడు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరిపై ఈ ప్రభావం పడి పార్టీకి భారీ నష్టం తప్పదన్నదే గణేష్ ఆవేదనగా తెలుస్తోంది. జగన్‌కు, వైసీపీకి నష్టం కలిగించే ఈ చర్యలు చూడలేకే గణేష్ తన అసహనాన్ని బయట పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. గణేష్ వయస్సు చిన్నదే అయినా రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్టే.. రాజానగరం మాత్రమే కాదు... రాజమండ్రి సిటీ, రూరల్.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనూ యువ నాయకుడిగా మంచి క్రేజ్ ఉంది. ఎన్నికలకు ముందు ముద్రగడ లాంటి కాకలు తీరిన కాపు నేత వైసీపీలోకి రావడంలోనూ చాలా పరిణామాలు ఉన్నా గణేష్ కూడా రాజకీయ చాతుర్యంతో పాటు పరిణితి ప్రదర్శించి జగన్ చేత ప్రశంసలు అందుకున్నాడు.
రాజమండ్రి రూరల్ గెలిపిస్తావా... పని చేసుకుంటావా ?
ఇక రాజమండ్రి రూరల్ సీటు వైసీపీకి ముందు నుంచి కొరకరాని కొయ్యగా మారింది. అసలు ఇక్కడ పార్టీ జెండా ఒక్కసారి కూడా ఎగరలేదు. పార్టీ రాష్ట్రంలో గెలిచిన 2019లోనూ ఓడిపోయింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రూరల్ సీటు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని జగన్ ఇప్పటికే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సారి రూరల్ నుంచి జక్కంపూడి గణేష్‌కు బాధ్యతలు ఇచ్చి పని చేయించుకోమని చెప్పాలని జగన్ నిర్ణయం తీసేసుకున్నారు. దీనిపై గణేష్‌తో జగన్ తన మాటగా కూడా చెప్పేశారు. ఇక్కడ పార్టీ జెండా ఎగరాలని కూడా తేల్చి చెప్పారు. జక్కంపూడి ఫ్యామిలీకి రూరల్ నియోజకవర్గం కంచుకోట.. పైగా సామాజిక సమీకరణల పరంగా ఆ వర్గం చాలా స్ట్రాంగ్‌గా ఉంది. గతంలో ఈ ప్లేస్‌లో ఉన్న కడియం నియోజకవర్గం నుంచే జక్కంపూడి రామ్మోహన్ పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత సొంతం చేసుకున్నారు. తర్వాత ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున జక్కంపూడి విజయలక్ష్మి సైతం పోటీ చేశారు. ప్రతి గ్రామంలోనూ జక్కంపూడి ఫ్యామిలీకి బలమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అందుకే జగన్ సైతం గణేష్‌కు రూరల్ పగ్గాలు అప్పగిస్తే ఇక్కడ పార్టీ పరుగులు పెట్టిస్తాడని.. 2029లో ఇక్కడ వైసీపీ జెండా రెపరెపలాడుతుందన్న ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏదేమైనా త్వరలోనే రాజమండ్రి సిటీ, రూరల్ వైసీపీలో కొన్ని మార్పులు, చేర్పులు చూడబోతున్నాం.
సమస్య మీది.. పరిష్కారం మాది.. జాగృతం కండి తెలుగు ప్రజలారా...
సమస్యలు లేని వ్యక్తులే కాదు.. సమాజం కూడా లేదు. అయితే.. సమస్య వచ్చినప్పుడు.. దానిని ఎవరికి చెప్పాలి ? ఎవరిని కలవాలి ? ఎలా పరిష్కరించుకోవాలి ? అనేది కీలకం. అది అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.