
తెలుగువారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన మహోన్నతుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి అన్నగారు ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విగ్రహాన్ని దేశంలోనే పెద్దదిగా ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అతి పెద్ద విగ్రహంగా ఉంది. దీనిని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని దేశానికే గొప్ప ఖ్యాతి కలిగించేలా చేశారు. పటేల్ విగ్రహం ఏర్పాటుతో గుజరాత్‌కు మంచి క్రేజ్ వచ్చింది.
అయితే ఇప్పుడు పటేల్ విగ్రహాన్ని మించేలా అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన. ఎన్టీఆర్ కీర్తి ఎన్నో ఏళ్ల పాటు అజరామరంగా.. నిలిచిపోయేలా.. ప్రపంచ చరిత్రలోనే ఆయనకు ఓ స్థానం కల్పించేలా ఈ విగ్రహ ఏర్పాటు ఉండాలన్నదే బాలు ప్లాన్. ఈ విగ్రహ నిర్మాణానికి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ విషయంలో నో చెప్పే ఛాన్సే లేదు. ఇక టీడీపీకి రాజకీయ శత్రవుగా ఉన్న వైసీపీ కూడా ఎన్టీఆర్ విగ్రహం విషయంలో రాద్దాంతం చేయవు.. వ్యతిరేకించనూ లేదు.
అయితే ఇక్కడ చిన్న చిక్కు ఏంటంటే దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. తెలంగాణలో అంబేద్కర్ విగ్రహాన్ని భారీ ఎత్తున నిర్మించినా దానికి గుజరాత్‌లోని వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మించి కట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో విగ్రహం ఎత్తును తగ్గించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం డయాస్ ఎత్తు పెంచింది. ఇక తమిళనాడులో అయితే కరుణానిధి విగ్రహానికి అస్సలు అనుమతులు ఇవ్వలేదు. 100 మీటర్ల ఎత్తు దాటిన విగ్రహాలు నిర్మించాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాల అనుమతులు తప్పనిసరి. మరి పటేల్ ఎత్తును దాటిన ఎన్టీఆర్ విగ్రహం నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనమతులు ఇస్తుందో ? లేదో ? చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌తో సమస్య మీది.. పరిష్కారం మాది..
అవినీతి అయినా.. లంచాలైనా.. రాజకీయ నాయకులు పెట్టే ఇబ్బందులు అయినా మీ సమస్యను మా సమస్యగా భుజాన వేసుకుంటాం. నేతలు పట్టించుకోవడం లేదని.. అధికారులు దురుసుగా వ్యవహరిస్తున్నారని చింతించాల్సిన అవసరమే లేదు. రండి.. చేయి చేయి కలుపుదాం.. మీ చింత తీర్చుదాం. మీ సమస్య ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.. పరిష్కార మార్గాన్ని పొందండి.