గ్రూప్-2 రాతపరీక్షల్లో అభ్యర్థులు ఓఎంఆర్ సమాధాన పత్రం కార్బన్లెస్ కాపీని వెంట తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అవకాశం కల్పిస్తోంది. అభ్యర్థులు తాము రాసిన సమాధానాలను సరిచూసుకునేందుకు, పరీక్షానంతరం సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తోడ్పడుతుందనే యోచనతో ఈ నిర్ణయం తీసుకుంది. 1,032 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 7,89,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.