తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు... రెక్కా డితే డొక్కాడని పరిస్థితి. అయితేనేం.. ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించి శభాష్ అనిపించు కుంది జీరు రమ్య. ఎచ్చెర్ల మండలం కొయ్యాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన ఆ యువతి బైపీసీ గ్రూపులో 966 మార్కులు సాధించి కాలేజీ టాపర్‌గా నిలిచింది. ఇదే మండలం కేకేనాయుడుపేటకు చెందిన ఈశ్వరరావు, రమణమ్మల పెద్ద కుమార్తె అయిన రమ్య గ్రూప్ సబ్జెక్ట్‌లన్నింటిలో 60కు 60 మార్కులు సాధించింది. అయితే ఆర్థిక స్థోమత కారణంగా ఆ యువతిని పై చదువులు చదివించాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో కన్పించడంలేదు. ఇంతవరకూ ఎంసెట్‌కు కూడా దరఖాస్తు చేసినట్టు లేదు. రమ్య చదువు మధ్యలోనే ఆగిపోకుండా దాతలు ముందుకొస్తే ఆ చదువుల తల్లికి ఊతం నిచ్చినట్టవుతుంది..
బెల్లుపడ గ్రామం అచ్చెంపేటకు చెందిన దుర్గాశి ధనం ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. సీఈసీలో 912 మార్కులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దుర్గాశి బాలరాజు, కమల దంపతుల కుమార్తె అయిన ధనం ఇచ్ఛాపురం ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్ విద్యను అభ్యసించింది. నిరుపేద కుటుంబమే అయినా.. చదువుకోవాలన్న తపన ఉంటే ఏవీ అడ్డంకి కాదని నిరూపిం చింది. ఇంటర్‌లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందిన ధనం బీకాం తరువాత సీఏ చదవాలని ఉందని తెలిపింది.