ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకుల్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మరే యూనివర్సిటీకి దక్కని విశిష్ట స్థానాన్ని కైవసం చేసుకుంది. 2018 సంవత్సరానికి గానూ రూపొందించిన ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాలో స్థానం పొందిన ఏకైక తెలుగు యూనివర్సిటీ ఇది మాత్రమే కావడం గర్వకారణం..
తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బోధనతో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తోందని ర్యాంకింగ్స్ సంస్థ నిర్ధారించింది. మొత్తం 6880 మంది విద్యార్థులు యూనివర్సిటీ విద్యనభ్యసిస్తున్నారని పేర్కొంది. ప్రతి 15 మంది స్టూడెంట్స్ కు ఒక అధ్యాపకుడు బోధిస్తున్నారని వివరించింది. అంతేకాక.. స్త్రీ పురుషుల నిష్పత్తిని 25:75గా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 601-800 మధ్య ర్యాంకుల్లో ఎస్వీ యూనివర్సిటీ స్థానం దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని మరే యూనివర్సిటీకి ఈ జాబితాలో స్థానం దక్కలేదు.
ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకుల లిస్టు విడుదలైంది. 2018 సంవత్సరానికి గానూ రూపొందించిన ఈ ర్యాంకుల జాబితాలో పలు భారతీయ సంస్థలు అగ్రస్థానాన్ని పొందాయి. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మొదటి స్థానం దక్కించుకుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్స్ టాప్ ర్యాంకులు దక్కించుకున్నా... పలు భారతీయ విశ్వవిద్యాలయాలు కూడా జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.
అలా దక్కించుకున్నవాటిలో జాదవ్ పూర్ యూనివర్సిటీ ఫస్ట్ ప్లేస్
లో నిలిచింది. కోల్ కతాలో ఉన్న ఈ యూనివర్సిటీ 501 -600 మధ్య స్థానం దక్కించుకుంది.
600 లోపు స్థానం దక్కించుకున్న ఐఐఎస్, ఐఐఎం యేతర భారతీయ యూనివర్సిటీ ఇది మాత్రమే
కావడం విశేషం. ఇక 601-800 మధ్య స్థానం పొందిన వాటిలో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ,
బిట్స్ పిలానీ, కలకత్తా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ,
సావిత్రిబాయ్ పూలే యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, టాటా ఇనిస్టిట్యూట్
ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, తేజ్ పూర్ యూనివర్సిటీ ఉన్నాయి.
జాదవ్ పూర్ యూనివర్సిటీ
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ
బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్ పిలానీ)
కోల్ కొత యూనివర్సిటి
ఢిల్లీ యూనివర్సిటీ
పంజాబ్ యూనివర్సిటి
సావిత్రిబాయ్ పూలే యూనివర్సిటీ
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్
తేజ్ పూర్ యూనివర్సిటీ