విద్యార్ధులు వారి వారి అవసారాలకి ఇప్పటి విద్యా విధానానికి తగ్గట్టుగా
వస్తున్న మార్పులకి తగ్గట్టుగా స్వల్ప మొత్తంలో రుణాలను అందిస్తున్నారు “క్రేజీబీ”.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
రాష్ట్రాల్లో కార్యకలాపాలను విస్తరిస్తోంది...మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులకు “క్రేజీబీ”ద్వారా స్టూడెంట్ లోన్‌లు సులభంగా అందుబాటులోకి
వస్తున్నాయి. విద్యార్థులు తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు రుణాలు
అందించేందుకు ఆయా వ్యక్తులు, సంస్థలు వారి మార్క్ షీట్లను
విశ్లేషిస్తున్నాయి..
పెద్దలు తమకు రుణం కావాలంటే వారి ఐటీ రిటన్స్..శాలరీ స్లిప్‌లు..క్రెడిట్ స్కోర్‌లను చూపుతారు. మరి విద్యార్ధులకు అలాంటి పత్రాలు ఉండవు కాబట్టి..వారి రుణ సామర్ధ్యం అంచనా వేసేందుకు తాము వినూత్న చర్యలతో స్టూడెంట్ రుణాలనుఅందిస్తాము అని “క్రేజీబీ” సీఈవో మధుసూధన్ చెప్పారు. స్టూడెంట్ లోన్స్ అధికంగా ల్యాప్‌టాప్..మొబైల్ ఫోన్‌లు..హార్డ్ డిస్క్‌లు కొనుగోలు చేసేందుకు తీసుకుంటారని చెబుతున్నారు. ఆయా విద్యా సంస్థల ప్రతిష్ట, ఉత్తీర్ణత శాతం, విద్యార్థుల వ్యక్తిగత సామర్ధ్యాన్ని కూడా రుణాలు ఇచ్చే సందర్భంలో రుణ దాతలు పరిశీలిస్తున్నారు.
అయితే ఇదే తరహాలో బెంగళూర్‌కు చెందిన విశ్వేశరయ్య టెక‍్నలాజికల్ యూనివర్సిటీ వంటి సంస్ధలు తమ విద్యార్థుల మార్కుల వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచుతుండటంతో ఆ వివరాలను ఆయా సంస్థలు పరిశీలించి రుణాలను అందచేస్తుండటంతో ప్రతిష్టాత్మక సంస్ధల్లో చదివే విద్యార్ధులకు సులభంగా రుణ వితరణ జరుగుతోంది..ఇక ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లే కాకుండా ద్విచక్ర వాహనాల కొనుగోలుకు, ఫీజుల చెల్లింపునకూ రుణాలు ఇస్తున్నారు.అయితే విద్యార్ధులు ఈ ఋణం చెల్లించడానికి చాలా సులభ వాయిదా పద్దతులు ఇస్తున్నారని తెలిపారు..