సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)...447 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...ఈ నోటిఫికేషన్ లో తెలిపిన 447 ఖాళీలు కానిస్టేబుల్ ,మరియు డ్రైవర్ ,పంప్ ఆపరేటర్ అనే విభాగాలుగా ప్రకటించారు.
పోస్టు-ఖాళీలు: కానిస్టేబుల్/డ్రైవర్-344 ; కానిస్టేబుల్/డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్-103.
వేతనశ్రేణి: రూ.21,700-రూ.69,100.
అర్హతలు: పదోతరగతి/తత్సమాన విద్యతోపాటు
డ్రైవింగ్ లెసైన్స్ (మోటార్ సైకిల్ విత్ గేర్, లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్
వెహికల్/ట్రాన్స్‌పోర్ట్ వెహికల్). అలాగే డ్రైవింగ్‌లో కనీసం మూడేళ్ల అనుభవం
ఉండాలి.
శారీరక ప్రమాణాలు (ఫిజికల్
స్టాండర్డ్స్): జనరల్/ఓబీసీ/ఎస్సీ కేటగిరీకి ఎత్తు-167 సెం.మీ., ఛాతీ-80 సెం.మీ. (సాధారణం)-85 సెం.మీ. (గాలి పీల్చినపుడు); ఎస్టీ కేటగిరీకి ఎత్తు-160 సెం.మీ., ఛాతీ-76 సెం.మీ. (సాధారణం)-81 సెం.మీ. (గాలి పీల్చినపుడు).
ఆరోగ్య ప్రమాణాలు: బరువు-ఎత్తు, వయసుకు అనుగుణంగా ఉండాలి. దృష్టి
సామర్థ్యం-నియర్ విజన్ ఎన్6, ఎన్6, డిస్టెన్స్ విజన్ 6/6, 6/6. కలర్ బ్లైండ్‌నెస్ ఉండకూడదు. అలాగే నిబంధనల మేర
తగిన శారీరక, మానసిక ఆరోగ్యం, దృఢత్వం ఉండాలి. టాటూ (పచ్చబొట్లు) ఉండకూడదు.
వయసు: 21-27 ఏళ్ల లోపు ఉండాలి.
రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్.
రాతపరీక్ష విధానం: దీన్ని ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అవేర్‌నెస్/జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్, ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్, బేసిక్ ఇంగ్లిష్/హిందీ నాలెడ్జ్ (పదో తరగతి
స్థాయి) అంశాల నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష
వ్యవధి రెండు గంటలు. ఇందులో జనరల్/మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీకి 33 శాతం మార్కులు రావాలి.
దేహ దారుఢ్య పరీక్ష
(ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్: పీఎస్‌టీ): ఇందులో పరుగు-800
మీటర్ల దూరాన్ని 3 నిమిషాల 15 సెకన్లలో పరిగెత్తగాలి. లాంగ్ జంప్-11 అడుగుల దూరాన్ని 3 ప్రయత్నాల్లో, హై జంప్-3 అడుగుల 6 అంగుళాలను 3 ప్రయత్నాల్లోపు అధిగమించాలి.
ఫిజికల్ స్టాండర్డ్స్
టెస్ట్ (పీఎస్‌టీ): హైట్ బార్, పీఈటీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను దీనికి ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థుల
శారీరక ప్రమాణాలను పరిశీలిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారిని డాక్యుమెంటేషన్‌కు
ఎంపిక చేస్తారు.
డాక్యుమెంటేషన్: ఇందులో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి
ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
ట్రేడ్ టెస్ట్ (డ్రైవింగ్
టెస్ట్): ఇందులో అభ్యర్థుల డ్రైవింగ్ సామర్థ్యంపై
పరీక్షలు ఉంటాయి. లైట్ వెహికల్, హెవీ వెహికల్ డ్రైవింగ్, మోటార్ మెకానికజమ్, వెహికల్ రిపెయిర్ నైపుణ్యాలను పరీక్షిస్తారు.
మొత్తం 130 మార్కులకు దీన్ని నిర్వహిస్తారు. ఇందులోనూ
ఉత్తీర్ణులైన అభ్యర్థుల మెరిట్ జాబితా ఆధారంగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి
తుది ఎంపిక నిర్వహిస్తారు.
దరఖాస్తు రుసుం: జనరల్/ఓబీసీ-రూ.100; మిగిలిన కేటగిరీలకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తు చివరి తేదీ: మార్చి 19, 2018.
పూర్తి వివరాలు
వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: cisfrectt.in