స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(ఎస్‌బీఐ).. హెచ్‌ఆర్ స్పెషలిస్టు, బ్యాంకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్టు తదితర స్పెషలిస్టు
కేడర్ ఆఫీసర్ ఖాళీలను రెగ్యులర్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేసేందుకు ఆన్‌లైన్
దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
రెగ్యులర్ పోస్టులు..
హెచ్‌ఆర్ స్పెషలిస్టు
(రిక్రూట్‌మెంట్): ఖాళీలు-1 (జనరల్).
హెచ్‌ఆర్ స్పెషలిస్టు
(మ్యాన్‌పవర్ ప్లానింగ్): ఖాళీలు-1 (జనరల్).
అర్హతలు: హెచ్‌ఆర్/పీజీడీఎం స్పెషలైజేషన్‌తో ఎంబీఏ. తగిన అనుభవం
ఉండాలి.
వయసు: 2018, మార్చి 31 నాటికి 32-35 ఏళ్లు. రిజర్వేషన్
అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఇంటర్నల్ కమ్యూనికేషన్
స్పెషలిస్టు: ఖాళీలు-1 (జనరల్).
అర్హతలు: మార్కెటింగ్/మాస్
మీడియా/ఫైనాన్‌స/కామర్స్‌లో ఎంబీఏ/పోస్టుగాడ్యుయేషన్. తగిన అనుభవం ఉండాలి.
వేతనాలు: హెచ్‌ఆర్ స్పెషలిస్టు (రిక్రూట్‌మెంట్)కు వార్షిక ప్యాకేజీ
దాదాపు రూ.16.08 లక్షలు; హెచ్‌ఆర్ స్పెషలిస్టు (మ్యాన్‌పవర్ ప్లానింగ్)కు రూ.19.50 లక్షలు; ఇంటర్నల్ కమ్యూనికేషన్
స్పెషలిస్టుకు రూ.23 లక్షలు.
కాంట్రాక్టు పోస్టులు..
బ్యాంకింగ్ సూపర్‌వైజరీ
స్పెషలిస్టు (బీఎస్‌ఎస్) ఖాళీలు : 3 (జనరల్).
అర్హతలు: బ్యాంకింగ్
రెగ్యులేషన్‌సలో 20-25 ఏళ్ల పని అనుభవం.
వయోపరిమితి: 2018, జనవరి 31 నాటికి 55-65 ఏళ్లు.
డిఫెన్స్ బ్యాంకింగ్
అడ్వైజర్ (ఆర్మీ) ఖాళీలు : 1 (జనరల్).
అర్హతలు: లెఫ్టినెంట్ జనరల్ లేదా ఆపై ర్యాంకులో రిటైర్డ్ అయుండాలి.
గరిష్ట వయసు 62 ఏళ్లు.
డిఫెన్స్ బ్యాంకింగ్
అడ్వైజర్ (పారామిలిటరీ దళాలు) ఖాళీలు : 1 (జనరల్).
అర్హతలు: ఏడీజీపీ లేదా ఆపై హోదాలో రిటైర్డ్ అయుండాలి. సీఆర్‌పీఎఫ్/పారామిలిటరీ ఫోర్స్‌లో అయిదేళ్ల అనుభవం. గరిష్ట వయసు 62 ఏళ్లు.
సర్కిల్ డిఫెన్‌స
బ్యాంకింగ్ అడ్వైజర్ ఖాళీలు : 5 (జనరల్-4, ఓబీసీ-1).
అర్హతలు: మేజర్ జనరల్ లేదా
బ్రిగేడియర్ హోదాలో రిటైర్డ్ అయుండాలి.
వేతనాలు: నిబంధనల మేరకు
ఉంటాయి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్+ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు: రెగ్యులర్ పోస్టులకు రూ.600. కాంట్రాక్టు పోస్టులకు ఫీజు
చెల్లించనవసరం లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి
తేదీ: జూన్ 2,
2018.
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.sbi.co.in/careers