న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్
ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (నీతి ఆయోగ్). తన శాఖల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న
కొన్ని ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా యాంగ్
ప్రొఫిషనల్, ఇన్నోవేషన్ లీడర్స్ వంటి పోస్టులకి ధరఖస్తులని కోరుతోంది.
యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.
ఖాళీలు: 60
ఒప్పంద కాలం: రెండేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్
లేదా రెండేళ్ల పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/ఎంబీబీఎస్/ఎల్‌ఎల్‌బీ లేదా
సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు.
ఇన్నోవేషన్ లీడ్(అటల్
ఇన్నోవేషన్ మిషన్).
ఖాళీలు:12
ఒప్పంద కాలం: మూడేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్
డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో
పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
ప్రొక్యూర్‌మెంట్
స్పెషలిస్టు పోస్టులు.
ఖాళీలు: 2
ఒప్పంద కాలం: రెండేళ్లు.
అర్హత: ఏదైనా సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్
లీడ్ పోస్టులు.
ఖాళీలు: 10
ఒప్పంద కాలం: రెండేళ్లు.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్
డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ లేదా సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో
పాటు కనీసం మూడేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2019.
ఎంపిక: సంస్థ నిబంధనల ప్రకారం
ఉంటుంది.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://niti.gov.in