ఏ దేశమైనా ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి తోడ్పడేది అక్కడి విద్యావంతులూ సుశిక్షిత మానవ వనరులే. దేశాన్ని 'నాలెడ్జ్‌ ఎకానమీ' దిశగా తీసుకెళ్లాలని కలలు కంటున్నారు ప్రణాళికాకర్తలు. వారి కలలు ఫలించాలంటే మారుతున్న అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు మారాలి. ఆర్థిక వద్ధి లక్ష్యాన్ని చేరాలంటే 2022 సంవత్సరానికల్లా 50 కోట్ల మందిని నిపుణులైన శ్రమశక్తిగా మార్చుకోవాల్సి ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి.ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న యువతకి నైపుణ్యాలు పెంచుకునే సౌకర్యాలేమీ అందుబాటులో లేవు.

 ' నిర్మాణ్‌ ' నవ సంకల్పం... 

బిట్స్‌పిలానీ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌. ఈ సంస్థ టెక్నోక్రాట్స్‌, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, సామాజిక శాస్త్ర నిపుణులు, సామాజిక కార్యకర్తలతో కలిసి పని చేస్తుంది. రాజస్తాన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, పుణె, చత్తీసఘఢ్‌, ముంబయి, కర్నాటక లోని పలు గ్రామాలలో నిర్మాణ్‌ వాలంటీర్లు పనిచేస్తున్నారు. మురికివాడల్లో నివసిస్తున్న మహిళలు, పిల్లలు, యువత కోసం పనిచేస్తున్నారు. వేల మంది పిల్లలకు కెరీర్‌ గైడెన్స్‌ అందిస్తున్నారు. పలు బహుళజాతి కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా 'నిర్మాణ్‌' కార్యక్రమాల్లో తమ వంతు సహాయం అందిస్తున్నాయి. విద్య, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివద్ధి వంటి అంశాలకు సంబంధించి 'నిర్మాణ్‌' కార్యక్రమాలుంటాయి.


 పేద యువతకు నైపుణ్య శిక్షణ యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలంటే ముందుగా పట్టభద్రులుగా విశ్వవిద్యాలయాలనుంచి బయటకు వస్తున్న వారిలో ఉద్యోగార్హత ఏ మేరకు ఉందో తెలుసుకొని 'నిర్మాణ్‌' సంస్ద ప్రణాళికా ప్రకారం ముందుకు సాగుతుంది. సంభాషణా చాతుర్యం, కంప్యూటర్‌ నైపుణ్యం, గణితం, చైతప్యవంతమైన ఆలోచనాధోరణి, ప్రవర్తన, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి, కొత్త పరిస్థితులకు అలవాటు పడడం... ఇలాంటి ఎన్నో అంశాలను పరిశీలించి యువత ఏయే అంశాల్లో ముందు నిలుస్తారో తెలుసుకుంటారు. ఆంగ్లంలో నైపుణ్యం, న్యూమరికల్‌ ఎబిలిటీ, క్రిటికల్‌ థింకింగ్‌లో యువతను ఉన్నతంగా తీర్చి దిద్దుతారు. ఉద్యోగులను ఎంపిక చేసుకునే ముందు సంస్థలు చూసేది ఇలాంటి నైపుణ్యాలనే. సర్కారీ విద్యాలయాల్లో చదివిన యువశక్తిని నిపుణులుగా మార్చుకోవడం నిర్మాణ్‌ ముందున్న లక్ష్యం.

మారుతున్న సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త నైపుణ్యాలను నేర్పే ప్రణాళికలు తయారు చేశారు. ఆంగ్లం చెప్పాలి కదాని తెలుగును దూరం చేయలేదు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూనే ఆంగ్లం నేర్పిస్తారు.

 నిరంతరం శిక్షణ... 

బీటెక్‌ లేదా కంప్యూటర్‌ అవగాహన ఉన్న ఏదైనా డిగ్రీ ప్యాసైన నిరుద్యోగ యువతీ యువకులకు  సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు,  ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. అసలీ నైపుణ్య శిక్షణను ఉచితంగా ఇవ్వాలని నిర్మాణ్‌ సంకల్పం. అయితే విద్యార్ధులకు కొంత బాధ్యత ఉంటే, శిక్షణ పట్ల శ్రద్ధ ఉంటుందని విద్యానిపుణుల సూచన మేరకు అతి స్వల్ప ఫీజులు నిర్ణయించారు. 

ఇదీ చిరునామా...

 ఆసక్తిగల అభ్యర్థులు ఆదిత్య ఎంక్లేవ్‌, నీలగిరి బ్లాక్‌, అమీర్‌పేట లోని నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు. ( వివరాలకు 7675914735, 9515134735 నెంబర్లను ) సంప్రదించండి. గ్రామీణ అభ్యర్దులకు ప్రతీ 3 నెలలకు ఒక సారి శిక్షణా కార్యక్రమం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: