ఐతే తాను పేదరికంలో పుట్టినా, ప్రతిభకు దరిద్రం లేదని నిరూపించాడు. పేరెంట్స్ చమటోడ్చి సంపాదించిన ప్రతీ పైసా తన చదువు కోసం ఖర్చు పెట్టడం గమనించిన తిలక్ కష్టపడి చదివి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలైన క్రమంలో నిర్మాణ్ సంస్ద నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని హైదరాబాద్ వచ్చి అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ పరిజ్నానంలో స్కిల్ డెవలప్ మెంట్ సాధించాడు.
అతని ప్రతిభను గుర్తించిన నిర్మాణ్ సంస్ధ నెక్సీల్యాబ్స్‌లో ప్లేస్ మెంట్‌ని కల్పించింది. నేడు డిజైనర్‌గా పనిచేస్తూ హ్యాపీగా జీవిస్తున్నాడు. ఆదాయంలో కొంత తల్లిదండ్రులకు పంపిస్తూ వారిని కూలీపని నుండి విముక్తి కల్పించాడు. తిలక్ లాంటి పేద యువకులకు అండగా నిలబడిని సంస్ధ 'నిర్మాణ్ ' గ్రామీణ పేద యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి , జీవితంలో స్ధిరపడేలా వారికి ప్లేస్ మెంట్ కల్పించడం నిర్మాణ్ లక్ష్మం. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా నిరాశకు లోనవకుండా నిర్మాణ్ ను సంప్రదించండి..
నిరంతరం శిక్షణ...
బీటెక్ లేదా కంప్యూటర్ అవగాహన ఉన్న ఏదైనా డిగ్రీ ప్యాసైన నిరుద్యోగ యువతీ యువకులకు సాఫ్ట్‌వేర్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు, డెల్, టెక్ మహీంద్ర, కాప్ జెమిని, లాంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. అసలీ నైపుణ్య శిక్షణను ఉచితంగా ఇవ్వాలని నిర్మాణ్ సంకల్పం. అయితే విద్యార్ధులకు కొంత బాధ్యత ఉంటే, శిక్షణ పట్ల శ్రద్ధ ఉంటందని విద్యానిపుణుల సూచన మేరకు అతి స్వల్ప ఫీజులు నిర్ణయించారు.
ఇదీ చిరునామా...
ఆసక్తిగల అభ్యర్థులు ఆదిత్య ఎంక్లేవ్, నీలగిరి బ్లాక్, అమీర్‌పేట లోని నిర్మాణ్ టెక్ మహేంద్ర ఫౌండేషన్ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతీ 3 నెలలకు ఒక సారి శిక్షణా కార్యక్రమం ఉంటుంది. మరిన్ని వివరాలకు, 7989164693, 7093001514, 9515134735 నెంబర్లను సంప్రదించండి.