ఇదొక పేద అమ్మాయి కథ. ఆమె లక్ష్యానికి తోడుగా నిలిచి, వెలుగు బాట చూపింది జిఎమ్‌ఆర్ ఫౌండేషన్.
ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం, రాజాంలో అతి పేద కుటుంబానికి చెందిన సంతోషి వాణి, బీఎస్సీ ఫస్టియర్‌లో ఉండగానే, సీసీఐపీ కార్యక్రమం కింద అమెరికాలో చదివేందుకు ఎంపిక అయ్యింది. సంతోషి పట్టుదలతో తన కలను నెరవేర్చుకుంది. ఆమె జీవితంలో పేదరికం ఉండవచ్చుకానీ,లక్ష్యంలో లేదు. జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో, అమెరికాలోని కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ ప్రోగ్రాంలో పది నెలల పాటు , ఆమె నాన్-డిగ్రీ కోర్సును చదివే అవకాశం పొందింది.
సీసీఐపీ కార్యక్రమం కింద 2019 సంవత్సరానికి అమెరికాలో చదివేందుకు ఎంపిక అయిన సంతోషి వాణి ఇప్పటి వరకు, జీఎంఆర్ ద్వారా సీసీఐపికి ఎంపిక అయిన ఎనిమిదో విద్యార్థి. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన సంతోషి వాణిని తల్లి పెంచి పెద్ద చేసింది. ఆమె లోని చురుకుదనం, ప్రతిభను గుర్తించిన జిఎంఆర్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ అందించింది. అలా గ్రాడ్యుయేషన్ చదువుతూ, సీసీఐపీ కార్యక్రమం ద్వారా అమెరికాలో చదువుకునే అవకాశం పొందింది.
కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం అంటే... ?
కమ్యూనిటీ కాలేజ్ ఇనీషియేటివ్ ప్రోగ్రాం అనేది,పేద విద్యార్థులు అమెరికాలోని ఏదో ఒక విభాగంలో పది నెలల పాటు నాన్ డిగ్రీ కోర్సును చదివే అవకాశం కల్పించడం. అమెరికాలోని వివిధ కమ్యూనిటీ కాలేజీలలో ఈ కోర్సులు పూర్తి చేయొచ్చు. అగ్రికల్చర్, అప్లైడ్ ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, పబ్లిక్ సేఫ్టీ, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కోర్సులలో చేరవచ్చు. అంతా ఉచితమే... కోర్సులకు సంబంధించిన అన్ని ఖర్చులూ, విమానప్రయాణ ఖర్చులు, లాడ్జింగ్ బోర్డింగ్ ఖర్చులు, పుస్తకాలు, వైద్య సదుపాయాలన్నీ, అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. అంతే కాకుండా, అభ్యర్థులు అమెరికాలో కోర్సు చేస్తున్నంత కాలం వారికయ్యే ఇతర ఖర్చుల కోసం నెలవారీ స్టయిఫండ్ కూడా ఇస్తారు.
అమెరికాలో చదివి, జీవితంలో స్ధిరపడ్డారు..
జీఎంఆర్ సహకారంతో 2015లో అమెరికాకు వెళ్లిన మొదటి విద్యార్థి రాజాంకు చెందిన మందడి ప్రవీణ్ కుమార్. నార్తన్ వర్జీనియా నుంచి బిజినెస్ మేనేజ్ మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోర్టును పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని ఒక ప్రముఖ కాలేజి నుంచి బీబీఏ కోర్సు పూర్తి చేశాడు , అతనికి తగిన ఉద్యోగం కల్పించే బాధ్యత జీఎంఆర్ తీసుకుంది.
2016లో అమెరికా వెళ్లొచ్చిన దూబ రామలక్ష్మి అయోవాలోని సెడార్ రాపిడ్స్ లోని కిర్క్ వుడ్ కమ్యూనిటీ కాలేజీలో 'హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్' ను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం రామలక్ష్మి హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ రిటైల్ అండ్ హాస్పిటాలిటీ లిమిటెడ్ లో సేల్స్ అసోసియేట్ గా పని చేస్తోంది.
2018లో షేక్ హసీనా కూడా అయోవాలోని సెడార్ రాపిడ్స్ లోని కిర్క్ వుడ్ కమ్యూనిటీ కాలేజీలో 'జియో స్పేషియల్ టెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్' కోర్సును పూర్తి చేసింది. ఆ కోర్సు పూర్తి చేశాక ఆమెకు, హైదరాబాద్ లోని జియోనో ఇండియా ప్రై. లి. సంస్థలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం, ఆర్ అండ్ డీ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఆవుల కావేరి కూడా, నార్తన్ వర్జీనియాలోని నార్తన్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో 'హాస్పిటాలిటీ అండ్ ఈవెంట్ మేనెజ్మెంట్' కోర్సును తీసుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని జీఎంఆర్ షేర్డ్ సర్వీసెస్ సెంటర్ లో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తోంది.
అభ్యర్థులను ఎంపిక చేసే విధానం...
1.అభ్యర్థులు ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఉండాలి. కానీ డిగ్రీ పూర్తి చేసి ఉండకూడదు.
2. అభ్యర్థులకు నిరుపేద నేపథ్యం ఉండాలి.
3. ఇంగ్లీషులో మాట్లాడడం బాగా వచ్చి ఉండాలి. అమెరికా కాన్సులేట్ ద్వారా అప్లికేషన్లను స్క్రీనింగ్ చేయడం, వాటిని షార్ట్ లిస్ట్ చేయడం, షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను టెలిఫోనిక్ లేదా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేయడం, అభ్యర్థులకు టోఫెల్ పరీక్ష నిర్వహించడం, దానిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు ఉంటాయి.
ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు అమెరికా విదేశాంగ శాఖ అమెరికాలోని వివిధ కమ్యూనిటీ కాలేజీలలో అడ్మిషన్లు కల్పించి, వారికి వీసా సదుపాయం కల్పిస్తుంది. సీసీఐపీకి ఎంపిక అయిన అభ్యర్థులకు గతంలో ఆ కోర్సును చేసి వచ్చిన అభ్యర్థుల ద్వారా వీసా విధానం, అమెరికాలో బస గురించిన విషయాల మీద వారికి జీఎంఆర్ అవగాహన కల్పిస్తుంది.