తెలంగాణా రాష్ట్ర హైకోర్టు   జిల్లాలవారీగా ఉన్న సబార్డినేట్ కోర్టులలో ఖాళీగా ఉన్న సుమారు 1539 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. ఇందుకు గాను ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి, టైపింగ్ అనుభవం ఉన్న వారికి ఇదొక గొప్ప అవకాశమనే చెప్పాలి. ఇక ఈ నోటిఫికేషన్ లో భాగంగా స్టెనోగ్రాఫర్ , జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ వంటి వివిధ ఖాళీలని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే...

 Image result for telangana high court

జిల్లాలవారీగా ఖాళీలు : కరీంనగర్, మెహబూబ్ నగర్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్ ,నిజామాబాద్ నల్గొండ వరంగల్, హైదరాబాద్..

 విభాగాల వారీగా ఖాళీలు :

స్టెనోగ్రాఫర్- 54

జూనియర్ అసిస్టెంట్ – 277

టైపిస్ట్  - 146

ఫీల్డ్ అసిస్టెంట్ – 65

ఎగ్జామినర్ – 57

కాపియిస్ట్  -  122

రికార్డ్ అసిస్టెంట్ – 5

ప్రాసెస్ సర్వర్  -  127

ఆఫీస్ సబార్డినేట్ – 686

 అర్హత :  ఉద్యోగాలని బట్టి అర్హతలు ఉన్నాయి, ఇంటర్, డిగ్రీ, టైపింగ్ (హైయ్యర్ ) అంతేకాదు పోస్తులని బట్టి అర్హతలు చూసుకుని ఆన్లైన్ లో అప్ప్లై చేసుకోవచ్చు.

 వయస్సు  -  ఆగస్టు -1 -2019 నాటికి 18-34 మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీ,బీసీలకి, పీహెచ్సి లకి పదేళ్ళ సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం -  ఆన్లైన్

దరఖాస్తు ఫీజు  -  ఓసీ, బీసీ లకి 800,  ఎస్సీ, ఎస్టీ లకి 400

దరఖాస్తు చివరి తేదీ -   సెప్టెంబర్  4 – 2019

 మరిన్ని వివరాలకోసం వెబ్సైటు  -   http://hc.ts.nic.insss

 


మరింత సమాచారం తెలుసుకోండి: