ఏపీ ప్రభుత్వం వన్ సరికొత్త పంథాలో ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఆయా గ్రామాల నుంచి విపరీతమైన స్పందన లభించింది. 1.6 లక్షల పైగా ఉద్యోగాలకు దాదాపు 21 లక్షలకు  పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  2019  సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం.

Image result for ap govt logo
ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న వారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి  వెబ్సైటు లింక్ ను అందుబాటులో ఉంచింది.  ఈ వెబ్సైటు లో కేటగిరి 1 , కేటగిరీ 3 పరీక్షల హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. మిగిలిన పరీక్షలకు కూడా త్వరలో హాల్ టికెట్లు వెబ్ సైట్ లోకి అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

గ్రామ సచివాలయ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం

http://gramasachivalayam.ap.gov.in/
ముందుగా ఈ  వెబ్సైట్ లింకును ఓపెన్ చేయాలి

  • ఓపెన్ చేయగానే హోం పేజీలోని కేటగిరి 1  లో అన్ని పోస్టులతోపాటు కేటగిరీలో 3 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు హాల్ టికెట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై  క్లిక్ చేస్తే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇందులో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి , అప్లికేషన్ ఐడి, లేదా ఆధార్ నెంబర్ ఈ మూడిలో ఏదైనా ఎంటర్ చేసి హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు

 


మరింత సమాచారం తెలుసుకోండి: