భారతదేశ రక్షణ వ్యవస్థలో ఉద్యోగం కోసం ఎంతో మంది యువకులు పోటీ పడుతుంటారు. రక్షణ వ్యవస్థలో ఎదో ఒక విభాగంలో చిన్న ఉద్యోగం వచ్చినా చాలు దేశానికి సేవ చేసినట్టే అంటూ సంతోష పడుతారు. అందుకోసం ఫిజికల్ గా, టెక్నికల్ గా కూడా ఎంతో శ్రమిస్తారు. రక్షణ రంగంలో కేవలం సైనికులుగా మాత్రమే కాదు వివిధ విభాగాలో ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. అలాంటిదే ఫైర్ మెన్ ఉద్యోగం కూడా. తాజాగా ఇండియన్ ఆర్మీ ఫైర్ మెన్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే.

 

మొత్తం పోస్టుల సంఖ్య : 15

పోస్టుల వివరాలు : ఫైర్ మెన్

అర్హత : 10th పాస్ తో పాటుగా నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పని సరి.

వయసు : 18 -25 ఏళ్ళ మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ఫిజికల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా

దరఖాస్తు విధానం : ఆన్లైన్

మరిన్ని వివరాలకోసం : ఎంప్లాయిమెంట్ న్యూస్ 14 -20 సెప్టెంబర్ -2019 ని పరిశీలించగలరు.

          లేదా : www.joinindianarmy.nic.in  


మరింత సమాచారం తెలుసుకోండి: