ప్రముఖ యూనివ‌ర్సిటీ  ఐనా యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం  ఖాళీలు 15. ఇక పోస్టుల వారీగా విద్యా అర్హతలు నిర్ణయించడం జరిగింది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌ తెలిపింది. ఇక ఆఫ్‌‌లైన్ విధానంలోనే దరఖాస్తు ప్రక్రియ మొదలు అవుతుంది అని యూనివ‌ర్సిటీ  తెలియచేయడం జరిగింది.

 

అసలు విషయానికి వస్తే పోస్టుల వివరాలు ఇలా.. డిప్యూటీ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్ లైబ్రేరియ‌న్‌, సీనియ‌ర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్,  జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, స్టెనో గ్రాఫ‌ర్‌, హిందీ టైపిస్ట్, మెస్ సూపర్‌వైజర్, లైబ్రరీ అసిస్టెంట్ వీటి అన్నిటికి 1 పోస్ట్ ఉన్నాయి. ల్యాబొరేటరీ అసిస్టెంట్ 02 , జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ 03 పోస్ట్లు ఉన్నాయి అని యూనివ‌ర్సిటీ  తెలియచేయడం  జరిగింది.

 

ఇక అసలు  అర్హత‌ విషయానికి వస్తే   పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత‌ ఉండాలి. తగిన అనుభ‌వం కచ్చితంగా ఉండాలి. ఇక వయసు  వయోపరిమితి మాత్రం డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుకు 50 సంవత్సరాలు, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులకు 45 సంవత్సరాలు, సీనియర్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులకు 40 సంవత్సరాలు, ఇతర పోస్టులకు 30 సంవత్సరాలలోపు కచ్చితంగా ఉండాలి.

 

ఇక ద‌ర‌ఖాస్తు విధానం  ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు  తీసుకోవడం జరుగుతుంది. ఎంపిక విధానం మాత్రం  స్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ముఖ్యమైన తేదీలు.. నోటిఫికేషన్ వెల్లడి: 22.11.2019 , దరఖాస్తు సమర్పణకు చివరితేది: 30.12.2019. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ను బాగా చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరడం జరిగినది.  చిరునామా కింద తెలపడం జరిగినది.

 

చిరునామా:
Assistant Registrar,
Admistrative Building,
University of hyderabad,
Gachibowli-500 046.
Hyderabad.

 

మరింత సమాచారం తెలుసుకోండి: