ఇంటర్, డిగ్రీయే కాదు.. ఇంజినీరింగ్ చదివినా ఇప్పుడు ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోంది. స్పెషల్ స్కిల్స్ లేకుండా జాబ్స్ రావడం లేదు. కంప్యూటర్, ఐటీ, ఇంగ్లీష్ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఉంటే ఉద్యోగ వేట మరింత సులువు అవుతుంది. అందుకే.. నిరుద్యోగ యువతకు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు హైదరాబాద్ కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ వెల్ఫేర్, టెక్ మహీంద్ర
ఫౌండేషన్ సంస్థల నిర్వాహకుడు అజిత్ కుమార్ ప్రకటించారు.

 

18 నుంచి 30 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువత ఇందుకు అర్హులు. ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారికి నాలుగు నెలల పాటు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు. ఏఏ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తారంటే.. బ్యాంకింగ్, ఫైనాన్స్,కంప్యూటర్ బేసిక్స్, ఐటీ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్.

 

ఈ విభాగాల్లో నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఏమైనా సందేహలు ఉంటే.. వివరాలకు 91006 89590 నంబరులో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: