కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెయిల్ లో పలు విభాగాల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. న్యూఢిల్లీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. సెయిల్‌కు చెందిన దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. వీటి ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు 105 పోస్టులు ఉన్నాయి. ఏమేం ఉద్యోగాలు ఉన్నాయంటే.. అసిస్టెంట్ మేనేజర్, మెడికల్ సర్వీస్ ప్రొవైడర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ తదితర జాబ్ లు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు .. ఆయా ఉద్యోగాన్ని బట్టి పదోతరగతితో పాటు, సంబంధిత ట్రేడుల్లో/సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత అవసరం.. కొన్ని ఉద్యోగాలకు అనుభవం కూడా ఉండాలి.
ఆన్‌లైన్ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 5 న ప్రారంభమవుతుంది. 27 జనవరి న ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం అనే వెబ్ సైట్ https:///sail.co.in/ ను చూడవచ్చు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ అన్ని రకాల అభ్యర్థులకు అవకాశాలు ఉన్నాయి.. ఈ పోస్టును షేర్ చేయడం ద్వారా వారికి మీరు సహాయం చేయవచ్చు.