నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-BHEL ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల బీహెచ్ఈఎల్ యూనిట్‌లో ఈ పోస్టున్నాయి. మొత్తం 300 పోస్టుల్ని ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. బీహెచ్ఈఎల్‌లో అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 20 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://jhs.bhel.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత, అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసి ఝాన్సీలోని బీహెచ్ఈఎల్ అడ్రస్‌కు పంపాలి. ఇక దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. పోస్టుల ఖాళీల వివరాలకు వస్తే.. మొత్తం ఖాళీలు- 300. అందులో ట్రేడ్ అప్రెంటీస్- 260, ఫిట్టర్- 85, టర్నర్- 10, మెషినిస్ట్- 10ఎలక్ట్రానిక్ (మెకానిక్)- 10, ఎలక్ట్రీషియన్- 80, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానిక్)- 10, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రానిక్)- 25, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 18, ప్లంబర్- 6, ఖాళీలు ఉన్నాయి.
వీటితో పాటు కార్పెంటర్- 6, టెక్నీషియన్ / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 40, ఎలక్ట్రికల్- 10, టెక్నికల్- 10, ఎలక్ట్రానిక్స్- 9, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్- 2, సివిల్- 2, కంప్యూటర్ అప్లికేషన్- 3, మోడర్న్ ఆఫీస్ మేనేజ్‌మెంట్, అండ్ సెక్రెటేరియల్ / ప్రాక్టీస్- 2, ఫార్మసీ అసిస్టెంట్- 2 ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత.. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 12వ తరగతి లేదా ఐటీఐ. టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు డిప్లొమా లేదా డిగ్రీ పాస్ కావాలి. వయస్సు.. కనీసం 18 నుంచి 27 ఏళ్లు. మరియు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2019 డిసెంబర్ 31 తేది కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2020 జనవరి 20.