అందరికీ ఉద్యోగాలు ఇచ్చే యూపీఎస్సీలో ఉద్యోగాల కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

మొత్తం ఖాళీలు: 24 పోస్టులు: ప్రిన్సిపల్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈ ఉద్యోగాలకు అర్హత.. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణత. కొన్ని ఉద్యోగాలకు అనుభవం కూడా అవసరం. రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 30, 2020. మరిన్ని వివరాలకు https://upsc.gov.in/ వెబ్ సైట్ పరిశీలించవచ్చు.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: