న్యూ ఢిల్లీలోని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంస్థ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. న్యూఢిల్లీలోని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

ఇందులో మొత్తం ఖాళీలు 26 వరకూ ఉన్నాయి. వాటిలో వివరాలు చూస్తే.. సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు 10 ఖాళీలు, జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు 16 ఖాలీలు. ఈ ఉద్యోగాలకు అర్హతలు ఏంటంటే.. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌/ తత్సమాన పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఇంకా నెట్‌/ గేట్‌ క్వాలిఫై అయి ఉండాలి. వీటితో పాటు అనుభవం కూడా అవసరం.

 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఉండదు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఫిబ్రవరి 21, 2020. మరిన్ని వివరాల కోసం https://www.fssai.gov.in/ వెబ్ సైట‌్ ను పరిశీలించండి.

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చి ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: