కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకి గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖలో కాళీగా ఉన్న సుమారు 3,10,832 ఉద్యోగాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఎస్సి, రైల్వే, పోస్టల్ సర్వీస్ బోర్డ్, రక్షణ శాఖ ఇలా వేరు వేరు శాఖలలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేపట్టింది. ప్రస్తుతానికి 3,10,832 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన కేంద్రం అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఈ మొత్తం పోస్టులలో 27,652 పోస్టులు డిఫెన్స్ పరిధిలో ఉన్నాయని కేంద్రం లోక్ సభకి సమాచారం అందించింది. ఇదిలాఉంటే 2018 మార్చి నాటికి 38లక్షల ఉద్యోగాలు కేటాయించామని ప్రస్తుతం 31 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. దాంతో ఖాళీగా సుమారు 6 లక్షలకి పైగానే ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అయితే 2019 నుంచీ 2020 ఆర్ధిక సంవసత్సరానికి గాను యూపీఎస్సీ, ఆర్ఆర్ బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మొత్తం కలిపి 1.34 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా నివేదికలు ఇచ్చాయి. అయితే
గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత పెద్దఎత్తున ఖాళీలు ఏర్పడటానికి కారణం,ఉద్యోగుల పదవీ విరమణ, మృతి చెందినా వారు, రాజీనామాలు, ప్రమోషన్లు, అలాగే రెండు మూడేళ్ళుగా ఖాళీగా ఉన్న పోస్టులు అన్నీ కలిపి ఇన్ని ఖాళీలు ఏర్పడ్డాయని కేంద్రం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకోసం ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతున్న నిరుద్యోగులకి ఇది మాత్రం తీపి కబురనే చెప్పాలి..