కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. దాదాపు లక్షా 40 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలకు గ్రూప్ B, Cలలో ఉద్యోగాల భర్తీ చేయనుంది. దశలవారీగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టులు, నాన్ టెక్నికల్ పోస్టులు భర్తీ చేస్తామని ఎస్.ఎస్.సి ఛైర్మన్ బ్రజ్ రాజ్ శర్మ చెప్పారు. 
 
2020 - 2021 ఆర్థిక సంవత్సరంలో 40,000 ఖాళీలను కమిషన్ భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు 18 నుండి 30 సంవత్సరాల వయస్సు వారు దరఖాస్తు చేయవచ్చు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పోస్టుల నియామకం, భర్తీ కొరకు ఇంటర్వ్యూలు, పరీక్షలను నిర్వహిస్తుంది. శర్మ అధికారిక ప్రకటనలో 14,611 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రభుత్వానికి నియామకం కొరకు సిఫారసు చేసినట్టు తెలిపారు. 
 
మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రివెన్సెస్ అండ్ పెన్షన్స్ శాఖ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కార్యాలయాల్లో 85 వేల పోస్టులు భర్తీ చేయడానికి కమిషన్ ఫలితాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. 1,40,000 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించటంపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: