బీటెక్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ రంగంలో అనుభవం గడించిన వారికి రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. తాజాగా రైల్వే సంస్థ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారతీయ రైల్వేకు చెందిన రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ తమ పరిధిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇంజనీర్ సివిల్ విభాగంలో 35 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది ఇవి రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలకు వెళితే..
మొత్తం పోస్టులు : 35
విద్యార్హత : సివిల్ ఇంజనీరింగ్ లో బిఈ, బీటెక్, బిఎస్సి(ఇంజనీరింగ్)
అనుభవం : రైల్వే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల ప్రాజెక్టులు, వాటి విభాగాల్లో రెండేళ్ళు పని చేసిన అనుభవం ఉండాలి
వయసు : 1 -2 - 2020 నాటికి 47 ఉండాలి
ఎంపిక విధానం : రాత పరీక్ష ,ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది
దరఖాస్తు ప్రారంభ తేదీ : 27-02-2020
దరఖాస్తు చివరితేదీ : 23-03-2020
పరీక్ష కేంద్రాలు - హైదరాబాద్ ఢిల్లీ, కొలకత్తా , చెన్నై ,ముంబై, నాగపూర్
దరఖాస్తు ఫీజు : జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 600, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ,ఎస్టీ ,దివ్యాంగులకు రూ. 300
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా
Assistant Manager (P)/ Rectt.,
RITES Ltd.,
RITES Bhawan,
Plot No , Sector -99
Gurgon -122001, Haryana
నోటిఫికేషన్ పై మరింత సమాచారం కోసం
https://rites.com/web/images/stories/uploadVacancy/1_20-Engineer%20DFC-cont-pay-scale-ad.pdf