నిరుద్యోగులకు ప్రతి రోజు ఏదొక విధంగా ఎక్కడొక చోట ఉద్యోగ నోటిఫికేషన్లు పడుతూనే ఉన్నాయి. ఒకసారి కేంద్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతే మరోసారి రాష్ట్రం నుండి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ విడుదల అయ్యి నిరుద్యోగులకు తీపి కబురు అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ నిరుద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం, విజయవాడ, కడప, నెల్లూరు జోన్లలో ఖాళీగా ఉన్న 5 వేల ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల నియామక ప్రక్రియను షురూ చేసింది. అయితే ఈ ప్రక్రియను ఏప్రిల్ 15వ తేదికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ పదో తరగతి, ఐటీఐ ఉంటె చాలు సరిపోతుంది.
అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం.. www.apprenticeship.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి అభ్యర్థులు వారి దరఖాస్తులను అప్లోడ్ చెయ్యాలి. అయితే ఈ అప్లికేషన్స్ కు 21-03-2020 తేదీతో ముగుస్తుంది. అంతేకాదు ఏప్రిల్ 9న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరగనున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.. డీజిల్ మెకానిక్‌లు 3160, మోటార్ మెకానిక్‌లు 200, ఎలక్ట్రిషియన్లు 560, వెల్డర్లు 160, పెయింటర్లు 320, మిల్‌రైట్ మెకానిక్‌లు 52, మెషినిష్టులు 16, షీటుమెటల్ వర్కర్లకు 520 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.