కరోనా వైరస్ ఎంత దారుణంగా వేగంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ కరోనా వైరస్ రోజు రోజుకు దారుణంగా సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షలమందికిపైగా ప్రజలకు వ్యాపించిందింది. అందులో 42వేలమంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. 

 

ఇంకా కరోనా దెబ్బతో భారత్ లో ప్రజలంతా కూడా ఇళ్ల నుండి బయటకు రాకూడదు అని ఏప్రిల్ 14వ తేదీ వరుకు లాక్ డౌన్ విధించారు. దీంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల‌తో పాటు సీబీఎస్ఈకి సంబంధించి కూడా అక‌డమిక్ పరీక్ష‌లు ముగియ‌లేదు. దీంతో కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ సంచలన నిర్ణ‌యం తీసుకుంది. 

 

సీబీఎస్ఈ  విద్యార్థులు 1 నుండి 8వ తరగతి వరకు అందరూ పై తరగతులకు ప్రమోట్ చేయాలనీ కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంకా 9, 10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల విషయానికి వస్తే, ఇప్పటి వరుకు నిర్వహించిన ప్రాజెక్టులు, పీరియాడిక్ పరీక్ష‌లు, టర్మ్ ఎగ్జామ్స్ మొదలైన వాటిని చూసి వారిని తదుపరి తరగతికు ప్రేమోట్ చెయ్యాలి అని హెచ్‌ఆర్‌డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: