డిగ్రీ పాస్ అయిన వారికి hdfc బ్యాంక్ గుడ్ న్యూస్ తెలిపింది. hdfc ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ 2020 లో భాగంగా ఇప్పటి వరకూ 3 బ్యాచ్ లకి తర్ఫీదు ఇచ్చింది. ప్రస్తుతం 4వ బ్యాచ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ మాత్రమే కాకుండా బ్యాంక్ ఇంటర్న్షిప్ కూడా ఉంటుంది. వచ్చే సెప్టెంబర్ 4వ తేదీన ఈ కోర్సు ప్రారంభం కానుందని తెలిపింది. మణిపాల్ యూనివర్సిటీ తో కలిసి hdfc బ్యాంక్ ఏడాదిపాటు ప్రొఫిషనల్ డిప్లమో ప్రోగ్రాం అందిస్తోంది. అయితే ఇందులో మొదటి ఆరు నెలలు కూడా రెసిడెన్షియల్ స్థాయిలో ఉంటుంది. అంతేకాదు హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. మరిన్ని వివరాలలోకి వెళ్తే..
కోర్సు పేరు : ఫ్యూచర్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్
పోస్టుల సంఖ్య : వెల్లడించలేదు.
అర్హత : 2019 జూన్ నాటికి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచీ 5౦% మార్కులతో డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి.
వయసు : 21 – 26 ఏళ్ళ మధ్య ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ : ౩౦-౦4-2020
ఎంపిక విధానం :ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి జాబ్ ఆఫర్ కూడా ఇస్తారు. ఈ క్రమంలో అభ్యర్ధులు చదువుల కోసం లోన్ కి అప్ప్లై చేసుకోవచ్చు. చదువు పూర్తి చేసిన తరువాత EMI లు చెల్లించుకోవాలి.
మరిన్ని వివరాలకోసం :
https://futurebankers.myamcat.com