
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను తీవ్రంగా వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ అతి తక్కువ సమయంలోనే దేశదేశాలు విస్తరించి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ డిగ్రీ పాసైనవారికి.. అందులోనూ గ్రామీణ భారతంపై అధ్యయనం చేద్దామనుకుంటున్న వారికి అద్భుత అవకాశాన్ని అందించింది ఎస్బీఐ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిగ్రీ పాసైనవారికి ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. ఎంపికైనవారు గ్రామీణాభివృద్ధిపై 13 నెలల ప్రోగ్రామ్ పూర్తి చేయాలి. డిగ్రీ పాసైన విద్యార్థులు, ఉద్యోగులు మరియు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఇక ఈ ఫెలోషిప్ కాలంలో అంకితభావంతో పనిచేయాలి. అలాగే వారంతా గ్రామాల్లోకి వెళ్లి అక్కడి సమస్యలు.. వాటిపై అధ్యయనం చేయాలి.
అందుకు వారికి ప్రముఖ ఎన్జీఓల ప్రతినిధులు, నిపుణులు సహకారం అందిస్తారు. కాబట్టి అభ్యర్థులకు గ్రామీణ భారతంలోని సామాజిక, ఆర్థిక అభివృద్ధి పట్ల అంకితభావం, ఆసక్తి, అభిరుచి ఖచ్చితంగా ఉండాలి. ఇక వేర్వేరు నేపథ్యం, వృత్తి, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు. అలాగే అభ్యర్థుల వయస్సు 2020 ఆగస్ట్ 1 నాటికి 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి. మరిన్ని పూర్తి వివరాల కోసం https://youthforindia.org/ వెబ్సైట్ చూడొచ్చు. ఆసక్తిగత అభ్యర్థులు https://register.you4.in/ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి.