క‌రోనా వైర‌స్.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే క‌నిపిస్తోంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ దేశ‌దేశాలు వ్యాప్తిచెంది.. అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇప్ప‌టికే క‌రోనా కాటుకు అనేక మంది ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రి ల‌క్ష‌ల మంది క‌రోనా సోకి హాస్ప‌ట‌ల్‌లో పోరాడుతున్నారు. ఇక క‌రోనా వైర‌స్‌ను నియంత్రించేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. మ‌రోవైపు క‌రోనా దెబ్బ‌కు ఆర్థిక వ్య‌వ‌స్థ మొత్తం కుప్ప‌కూలింది. 

 

అనేక కంపెనీలు అప్పుల భారం త‌ట్టుకోలేక మూత‌ప‌డ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు కాస్త నిరుద్యోగులుగా మారారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గుడ్ న్యూస్ అందించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూ ఢిల్లీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  మొత్తం 150 ఖాళీలను ప్రకటించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్-JRF పోస్టుల భర్తీకి 2020 జూలై 12న నేషనల్ లెవెల్ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 

 

అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఏప్రిల్ 27న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 మే 27 చివరి తేదీ. ఇక మొత్తం జేఆర్ఎఫ్ పోస్టులు 150 ఉండ‌గా.. అందులో బయోమెడికల్ సైన్సెస్120 మ‌రియు సోషల్ సైన్సెస్ 30 ఉన్నాయి. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. 55% మార్కులతో ఎంఎస్సీ, ఎంఏ పాస్ కావాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది. మ‌రియు 2019-2020 విద్యాసంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాల‌కు అప్లై చేయొచ్చు. వ‌య‌స్సు విష‌యానికి వ‌స్తే 2020 సెప్టెంబర్ 30 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు వయస్సులో మూడేళ్ల సడలింపు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.icmr.nic.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: