
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ లేని ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు దేశదేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ మహమ్మారి అదుపులోకి రావడం లేదు. ముఖ్యంగా కరోనా దెబ్బకు అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 30 లక్షలు దాటగా.. మృతుల సంఖ్య రెండు లక్షలు మించిపోయింది. అయితే ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
ఈ లాక్‌డౌన్ కారణంగా ఎందరో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ దెబ్బకు కొన్ని కంపెనీలు మూతపడడంతో ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్-IFB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ లేదా బాటనీ లేదా బయో టెక్నాలజీ లేదా మెరైన్ బయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వివరించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేది 2020 మే 1. అంటే మరో రెండు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు ప్రారంభించండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అధికారిక వెబ్‌సైట్ http://ifb.icfre.gov.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.