ఎవరికి ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది ? అసలు ఏం ఇచ్చింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న! కరోనా వైరస్ నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలు, చదువులు ఎంత గందరగోళానికి గురయ్యాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇంకా విద్యా సంవత్సరం కూడా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు.. ఎలా ఉండనుందో కూడా తెలియదు.. 

 

ఇంకా అలాంటి ఈ సమయంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీ నగర్‌ ఒక విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కరోనా వైరస్ పడిన గ్రాడ్యుయేట్ల కోసం కొత్త ప్రోగ్రాంను రూపకల్పన చేసింది. అసలు ఏం చేసింది అంటే? సంవత్సరం కాలవ్యవధితో కూడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రాంని మొదలు పెట్టింది. 

 

దీంతో ఈ కోర్సుకు కరోనా బారిన పడిన విద్యార్థులు ఎలాంటి ప్రవేశ పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు.. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ప్రత్యేకంగా బయోలాజికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ వంటి విభాగాల్లో ఉండనుంది.. ఇంకా ఈ ప్రోగ్రాం పూర్తి చేసిన విద్యార్థులు ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లో లేటరల్‌ ఎంట్రీలో సీటు పొందగలుగుతారు. అయితే పరీక్షా లేకుండా ఎంట్రెన్స్ కేవలం ఈ ఒక్క సంవత్సరమే అని వారు స్పష్టం చేశారు. 

 

కాగా కరోనా వైరస్ కారణంగా మర్చి 16 నుండి దేశంలోని మొత్తం స్కూల్స్, కాలెజిస్, యూనివర్సిటీలు అన్ని కూడా మూసివేశారు.. పదోవ తరగతి పిల్లలకు ఇంకా పరీక్షలే జరగలేదు.. అంతేకాదు.. అలా మూసేశారో లేదో లాక్ డౌన్ విధించారు.. ఇంకా ఇప్పటికి లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది. 

 

అంతేకాదు.. ఈ లాక్ డౌన్ కారణంగా 25 మిలియన్ ఉద్యోగాలు ఊడిపోయాయిట.. ఇంకా పిల్లల అకడమిక్ ఇయర్ కూడా అంత అర్థం కాకుండా ఉంది.. మరి ఈ కరోనా ఎప్పుడు తగ్గుతుందో చూడాలి.. మన భారత్ లో కూడా స్లో పాయిజన్ లా కరోనా ఎటాక్ చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: