ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం అత‌లా కుత‌లం అవుతున్నాయి. అంత‌లా ఈ క‌రోనా మ‌హ‌మ్మారి విశ్వ‌రూపం చూపిస్తోంది. కరోనా మహమ్మారితో తలెత్తిన విషమ పరిస్థితులు మాటల్లో చెప్పనలవి కాదు.. ఆర్థికంగా దెబ్బ తిన్న సంస్థలు తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారు. దీంతో చాలా మంది ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో పీజీ పాసైనవారికి గుడ్ న్యూస్ చెబుతూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ICMR జూనియర్ రీసెర్చ్ ఫెలో-JRF పోస్టుల్ని భర్తీ చేస్తోంది. 

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 150 ఖాళీలను ప్రకటించింది. సోషల్ సైన్సెస్, బయోమెడికల్ సైన్సెస్‌తో పాటు పలు విభాగాల్లో వీరిని నియమించనుంది. ఇక మొత్తం జేఆర్ఎఫ్ పోస్టులు 150 ఉండగా అందులో బయోమెడికల్ సైన్సెస్-120, సోషల్ సైన్సెస్-30 పోస్టులున్నాయి. విద్యార్హత విష‌యానికి వ‌స్తే.. 55% మార్కులతో ఎంఎస్సీ, ఎంఏ పాస్ అవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసైతే స‌రిపోతుంది. 2019-2020 విద్యాసంవత్సరంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా ఈ పోస్టుల‌కు అప్లై చేయొచ్చు.

 

అభ్యర్థుల వయస్సు 2020 సెప్టెంబర్ 30 నాటికి 28 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, మహిళలకు వయస్సులో మూడేళ్ల సడలింపు ఉంటుంది. హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, గువాహతి, కోల్‌కతా, ముంబై, శ్రీనగర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, వారణాసిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 ఏప్రిల్ 27 నుంచే ప్రారంభం అయింది. దరఖాస్తుకు 2020 మే 27 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. కాబ‌ట్టి.. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభించండి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలు https://icmr.nic.in/ లేదా http://pgimer.edu.in/ వెబ్‌సైట్స్ ఓపెన్ చేసి తెలుసుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: