
దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఉద్యోగులు కూడా నిరుద్యోగులుగా మారడంతో.. ఈ తీవ్రత మరింత ఎక్కువ అయింది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ప్రపంచదేశాలను విలవిలలాడిస్తోంది. దీంతో కరోనా పేరు చెబితేనే ప్రజలు వణికిపోతున్నారు. చిన్నా.. పెద్దా అని తేడా లేకుండా అందరినీ కరోనా భయపెడుతోంది. అగ్రరాజ్యాలు సైతం కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇంతటి ఘోర కలిని ఊహించని ప్రపంచ దేశాలు దీనిని ఎలా ఎదుర్కోవాలో తెలీక గందరగోళంలో పడిపోయాయి. అనుకోకుండా వచ్చిన మహమ్మారి కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. వ్యాక్సిన్ లేని కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు.
దీంతో ఎన్నో సంస్థ ఆర్థికంగా తట్టుకోలేక తమ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ హైదరాబాద్‌లోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-EFLU ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 58 పోస్టులున్నాయి. వేర్వేరు విభాగాల్లో టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటి ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 15 చివరి తేదీ.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.efluniversity.ac.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇక మొత్తం ఖాళీలు 58 ఉండగా.. అందులో ప్రొఫెసర్- 18, అసోసియేట్ ప్రొఫెసర్- 27, అసిస్టెంట్ ప్రొఫెసర్- 13 ఉన్నాయి. అయితే హైదరాబాద్‌తో పాటు షిల్లాం, లక్నోలోని రీజనల్ క్యాంపస్‌లలో కూడా ఈ ఖాళీలున్నాయి. విద్యార్హత విషయానికి వస్తే.. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. అసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు ఫామ్‌ను పైన చెప్పిన వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి. దరఖాస్తుకు చివరి తేదీ.. 2020 జూన్ 15 సాయంత్రం 6 గంటలు. అసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.