
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచదేశాలు విలవిలలాడిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్.. అనాతి కాలంలోనే దేశదేశాలు విస్తరించింది. ఈ క్రమంలోనే లక్షల మంది ప్రాణాలు బలితీసుకుంటోంది. ఈ మహమ్మారి దెబ్బకు అగ్రరాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. ఇక మరోవైపు కరోనా దెబ్బతో ఆర్థికంగా ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగాలు సైతం పోతున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ హైకోర్టు పలు ఖాళీలను భర్తీ చేస్తోంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 87 సివిల్ జడ్జి పోస్టుల్ని భర్తీ చేస్తోంది తెలంగాణ హైకోర్టు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఇక ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాక్ టెస్ట్‌కు హాజరుకావొచ్చు. http://tshc.gov.in/ వెబ్సైట్లోనే మాక్ టెస్ట్ లింక్ యాక్టివేట్ అయింది. ఇక మొత్తం 87 ఉండగా.. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే పోస్టులు- 70, ట్రాన్స్ఫర్ భర్తీ చేసే పోస్టులు- 17 ఉన్నాయి. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉండాలి.
అలాగే ఏదైనా కోర్టులో మూడు ఏళ్లకు పైగా అడ్వకేట్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఇక వాస్తవానికి ఈ ఉద్యోగాలకు 2020 ఏప్రిల్ 13న దరఖాస్తు గడువు ముగిసింది. కానీ, కరోనా కారణంగా దరఖాస్తు గడువును మొదట 2020 మే 15 వరకు, ఆ తర్వాత జూన్ 15 వరకు పొడిగించింది. దీనిని బట్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 15 వరకు గడువు మిగిలి ఉంది. ఇక అభ్యర్థుల వయస్సు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు http://tshc.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవచ్చు.