కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న అనేక విభాగాలలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏవేవి... ఎక్కడ...? ఎన్ని పోస్టులు... ఖాళీగా ఉన్నాయి ఒకసారి చూసేయండి. మీరు గనక ఈ పోస్ట్ కు సంబంధించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని సంపాదించండి. పూర్తి వివరాలు మీకోసం...

 


NTPC లో ఖాళీల వివరాలు ఇలా ... న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న NTPC లిమిటెడ్ ఫిక్స్‌ డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దర ఖాస్తులు కోరుతోంది. ఇక ఇందులో మొత్తం ఖాళీలు: 23 పోస్టులు. ఇక వాటి వివరాలు చూస్తే ... ఎగ్జిక్యూటివ్‌ (ఎక్స్‌ కవేషన్‌ )–02, ఎగ్జిక్యూటివ్‌ (మైన్ ప్లానింగ్‌ )–02, మైన్ సర్వేయర్ హెడ్‌ –01, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ ‌‌/ మైన్ సర్వేయర్‌‌–18 గా ఉన్నాయి. ఇక ఈ ఉద్యోగాలకు దినుంచి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా(ఇంజినీరింగ్‌ ), ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉండాలి. ఇక ఈ ఉద్యోగాల కోసం సెలెక్షన్ ప్రాసెస్‌ ఇంటర్వ్యూ ఆధారంగా  జరుగును. వీటికోసం ఆన్‌ లైన్‌ లో ఆప్లై చేయాలి. ఇందుకు చివరి తేది జూన్‌ 22.

 

 

ECIL‌ లో ఖాళీల వివరాలు ఇలా ... హైదరాబాద్‌ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌‌ (ECIL‌ ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో ఖాళీలు చూస్తే 12 పోస్ట్లు ఉన్నాయి. వీటికి అర్హత ఇంజినీరింగ్ డిగ్రీ (కంప్యూటర్ సైన్స్‌ ) ఉత్తీర్ణత, అనుభవం. వయసు 30 సంవత్సరాలు మించకూడదు. ఇక వీటికి సెలెక్షన్ ప్రాసెస్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా చేయబడును. అలాగే ఆన్‌ లైన్‌ లో అప్లై చేయాలి. చివరి తేది జూన్‌ 22. పూర్తి వివరాలకు www.ecil.co.in ను చుడండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: