కేంద్ర ప్రభుత్వం అనేక విభాగాలలో కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏ పోస్టులు... ఎక్కడ ఎన్ని  ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూసేయండి. మీరు కానీ ఈ పోస్ట్ లకు సంబంధించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని సంపాదించండి.  ఇక పూర్తి వివరాలు మీకోసం...

 

 

AIASLలో ఖాళీల వివరాలు ఇలా ... ఎయిర్ ఇండియా ఎయిర్‌‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ‌‌(AIASL) ఫిక్స్‌ డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో మొత్తం ఖాళీలు 17. పోస్టుల వివరాలలోకి వస్తే చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌‌–01, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్‌‌–01, మేనేజర్ ‌‌(ఫైనాన్స్‌) – 01, ఆఫీసర్‌ ‌(అకౌంట్స్‌) – 04, అసిస్టెంట్‌ ‌(అకౌంట్స్‌) – 10; ఇక వీథి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ ప్రాసెస్‌ షార్ట్‌‌లిస్టింగ్‌, పర్స‌‌నల్ ఇంటర్వ్యూ ద్వారా చేయబడును.  వీటికి ఈమెయిల్ ద్వారా అప్లై చేయాలి. మీ డీటెయిల్స్ ను పంపాల్సిన ఈ–మెయిల్: hrhq.aiasl@airindia.in.

 


HAL‌ లో మార్కెటింగ్ ఆఫీసర్లు ఖాళీల వివరాలు ఇలా ... మహారాష్ట్ర లోని పుణెలో భారత ప్రభుత్వ కెమికల్స్ & ఫర్టి లైజర్స్ మంత్రిత్వశాఖకు చెందిన హిందుస్థాన్ యాంటీ బయోటిక్స్ లిమిటెడ్ ‌‌(HAL‌) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇక ఇందులో మార్కెటింగ్ ఆఫీసర్‌‌–05 పోస్టులు ఉన్నాయి. వీటికి అర్హత గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, బిజినెస్ డెవలప్మెంట్ ‌‌లో అనుభవం కలిగి ఉండాలి. ఇక ఇందుకోసం ఆఫ్ ‌‌లైన్‌ లేదా ఈమెయిల్‌‌ ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:  ది సీనియర్ ఆఫీసర్ ‌‌‌‌(HR‌‌‌‌), హిందుస్తాన్ యాంటి బయోటిక్స్‌ లిమిటెడ్‌ , పింప్రి, పుణె –411018. లేకపోతే పూర్తివివరాలను ఈ – మెయిల్ halper.rec@gmail.com కి పంపవచ్చు. ఇక ఈ పోస్టులకు చివరి తేది జూన్‌ 13.

మరింత సమాచారం తెలుసుకోండి: