కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని చూసి అందులో మీకు సరిపోయి, ఆ పోస్ట్ లకు సంబంధించి అర్హులు అయితే వెంటనే అప్లై చేసి ఉద్యోగాన్ని పొందండి. ఇక ఆ ఉద్యోగాల పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ చుడండి...
UIIC లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ఖాళీల వివరాలు ఇలా... చెన్నై లోని భారత ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెడికల్) ఖాళీలు 10. వీటికి అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ కచ్చితంగా చేసి ఉండాలి. అలాగే వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య మాత్రమే ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా చేయబడును. అలాగే ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇందుకోసం చివరి తేది జూన్ 10. పూర్తి వివరాల కోసం www.uiic.co.in ను చూడండి.
ఇక అలాగే IGIMS లో ఫ్యాకల్టీ ఖాళీల వివరాలు ఇలా... బిహార్ రాష్ట్రములోని ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( IGIMS ) ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో మొత్తం ఖాళీలు 65 పోస్టులు. ఇక ఇందులో ఉద్యోగాల వివరాలు చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, లేడీ మెడికల్ ఆఫీసర్. ఇక ఇందులో విభాగాల విషయానికి వస్తే ఆర్థో పెడిక్స్, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్, యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విబాలలో మాత్రమే అవకాశం ఉన్నాయి. వీటి అరహతా విషయానికి వస్తే పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో ఎంబీబీఎస్, ఎంసీహెచ్ , డీఎం, ఎండీ / ఎంఎస్, ఎంఎస్సీ (న్యూక్లియర్ మెడిసిన్), పీహెచ్‌డీ కలిగి ఉండాలి. ఇక అలాగే ఆఫ్‌లైన్, ఈ–మెయిల్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. వీటికి సంబంధిత దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - డైరెక్టర్, ఐజీఐఎంఎస్, షేక్‌పురా, పాట్నా, బిహార్. అలాగే వివరాలు పంపాల్సిన ఈ–మెయిల్ director@igims.org . ఇందుకోసం చివరి తేది జూన్ 19.