ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి.. అనాతి కాలంలోనే దేశదేశాలు విస్తరించి ప్రజలందరికీ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు వ్యాక్సిన్స్ అందుబాటులోకి రాకపోవడంతో.. కరోనా విజృంభణకు కట్టడి పడడం లేదు. మరోవైపు కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు మూత పడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేసుల తీవ్రత పెరుగుతున్న క్రమంలో.. విద్యాసంస్థల ఓపెనింగ్‌పై విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. తెరిచాక ఎలా ఉంటుదో అర్థం కావడం లేదు. ఒకవేళ ఓపెన్ చేసినా.. పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్లకు పంపుతారో లేదో తెలీదు. అయితే ఇలాంటి సమయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్కూళ్లు ఎప్పుడు ఓపెన్ చేస్తామో చెప్పారు. ఆగస్ట్ తర్వాతే స్కూళ్లు ఓపెన్ చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. జూన్ 3న జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.
గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే స్కూళ్లను ముందుగా ఓపెన్ చేయనున్నారు. బహుశా ఆగస్ట్ 15 తర్వాత స్కూళ్లు ఓపెన్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా, కేవలం 33 శాతం అటెండెన్స్‌తో స్కూళ్లు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అది కూడా 8 కంటే చిన్న తరగతుల వారిని మినహాయించి, ఆ పైన విద్యార్థులకు మాత్రమే స్కూళ్లు నిర్వహించే చాన్స్ ఉంది. మిగిలిన వారు ఇంటికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అలాగే రెండు సెషన్లలో స్కూళ్లు నిర్వహిస్తారు. మార్నింగ్ ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ విద్యార్థులు క్లాసులకు హాజరయ్యేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఇక స్కూళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు, శానిటైజర్లు వాడటం తప్పనిసరి. వీటిని విద్యార్థులు పాటించకపోతే ఫైన్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.